గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది. చంద్రుడు వేగంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అక్షయ తృతీయ నాడు చూస్తే, చంద్రుడు సూర్యుడి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. చంద్ర సంచారంలో మార్పు వల్ల, చంద్రుడు సూర్యుడు నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలోకి ఏప్రిల్ 19 ఆదివారం ఉదయం 7:09కి ప్రవేశిస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ.

ఇలా సూర్య నక్షత్రంలో చంద్రుడు సంచారం చేయడంతో అక్షయ తృతీయ అని అంటారు. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి అక్షయ తృతీయ నాడు ప్రవేశించి ఏప్రిల్ 20 ఉదయం 4:34 వరకు ఉంటాడు. చంద్రుడి సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
అక్షయ తృతీయ నాడు చంద్రుని సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:
1.సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సంచారంలో మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. కృత్తికా నక్షత్రానికి చంద్రుడు ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. బంధం, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం.
2.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి చంద్ర సంచారంలో మార్పు అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది. ఈ రాశి వారు సక్సెస్ చూస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అనుకున్న డీల్స్ మీ చేతికి వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థిక నష్టం లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
4.కర్కాటక రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పూర్వికుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. ఆర్థిక నష్టం లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
4.కర్కాటక రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి చంద్ర సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత అప్పులు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.