...
...
Next Story

అమలక ఏకాదశి ఫిబ్రవరి 26న, 27న? ఆ రోజు ఉసిరి దీపాలను ఎందుకు వెలిగించాలి, పూజ, పరిహారాలు వివరాలు తెలుసుకోండి!

ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు అమలక ఏకాదశి జరుపుకుంటాము. ఆ రోజు భక్తిశ్రద్ధలతో విష్ణువుని ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. దీనిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారని నమ్మకం.

Published on: Feb 25, 2026, 15:00:57 IST
Advertisement

అమలక ఏకాదశి 2026: ఏకాదశి తిథి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు అమలక ఏకాదశి జరుపుకుంటాము. ఆ రోజు భక్తిశ్రద్ధలతో విష్ణువుని ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

అమలక ఏకాదశి 2026 (pinterest)
అమలక ఏకాదశి 2026 (pinterest)

దీనిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారని నమ్మకం. అమలక ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు పసుపు వస్త్రాలను ధరించి, ఉసిరికాయలను ఇతర పండ్లను దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది.

అమలక ఏకాదశి నాడు లక్షీ కటాక్షం

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఉసిరి చెట్టుకు నీరు పోసి, ఉసిరి చెట్టు ప్రదక్షిణాలు చేసి “ఓం శ్రీ విష్ణు ప్రియ నమః” అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఉసిరి చెట్టు కింద ఆవనూనెతో దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన ఆనందంగా ఉండొచ్చు, సమస్యలు తొలగిపోతాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి.

అమలక ఏకాదశి తేదీ, సమయం

ఈ ఏడాది అమలక ఏకాదశి ఫిబ్రవరి 27న వచ్చింది. ఏకాదశి తిథి ఫిబ్రవరి 26 అర్ధరాత్రి 12:33కి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 రాత్రి 10:30:22తో ముగుస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి.

అమలక ఏకాదశి విశిష్టత

ఏకాదశి నాడు తులసి దళాలతో విష్ణువును, లక్ష్మీదేవిని పూజించండి. “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపించండి. విష్ణువుకు పూలు, అక్షింతలు, కుంకుమ సమర్పించండి. అలాగే ఉసిరి దీపాలను వెలిగిస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. నైవేద్యంగా ఉసిరికాయలను కూడా సమర్పించవచ్చు. ఆ రోజు ఏకాదశి స్తోత్రాలు చదవడం మంచిది. అలాగే విష్ణు శ్లోకాలను పారాయణం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks