Amalaki Ekadashi: అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో
ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజు విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉపవాసం ఉంటారు. ఇలా ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. ప్రతీ ఏటా ఫాల్గుణమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అని అంటారు. తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు.
ప్రతీ ఏటా ఫాల్గుణమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అని అంటారు. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజు విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. ఇలా ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. సకల పాపాలు తొలగిపోయి విముక్తి కలుగుతుందని, జీవితంలో ఆనందం ఉంటుందని కూడా చెబుతారు.

అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి 2026 చాలా ప్రత్యేకమైనది. ఈరోజు విష్ణువు, శివుడు, పార్వతిని ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పూజా విధానం, శుభముహూర్తం, పాటించాల్సిన విధానాల గురించి తెలుసుకుందాం.
అమలకి ఏకాదశి 2026
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి ఫిబ్రవరి 27 రాత్రి 12:33కి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 రాత్రి 10:22కి ముగుస్తుంది. ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఫిబ్రవరి 27న పాటించాలి.
అమలకి ఏకాదశి 2026 శుభ ముహూర్తం
అభిజిత్ ముహూర్తం అనేది చాలా శుభప్రదమైన సమయం. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16కి ప్రారంభమై 1:02 నిమిషాలకు ముగుస్తుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు ఉంటుంది.
అమలకి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?
ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఫిబ్రవరి 28 ఉదయం 6:47 నుంచి 9:06 మధ్యలో విరమించడం అనుకూలంగా ఉంటుంది. ఉపవాసాన్ని విరమించడానికి ముందు విష్ణువును ఆరాధించి, తోచిన వాటిని దానం ఇచ్చి విరమించడం మంచిది.
అమలకి ఏకాదశి 2026 పూజా విధానం
ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించండి.
శివపార్వతులను, విష్ణువును పూజించండి.
చందనం, బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు వంటివి భక్తిశ్రద్ధలతో సమర్పించండి. స్వీట్లు నైవేద్యంగా పెట్టండి.
వివాహం అవ్వని వారు శివ పార్వతులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది.
విష్ణువును కూడా ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండండి.
కుదిరితే ఉసిరిని సమర్పించండి. ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించండి.
ఏకాదశి కథను కూడా చదువుకుని ధూప, దీప, నైవేద్యాలతో పరమ భక్తితో పూజించండి. పుణ్య ఫలాలను పొందండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


