Falguna Masam: ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాసం.. ఈ మాసం ప్రత్యేకతలు, విశిష్టత, ముఖ్యమైన రోజులు తెలుసుకోండి!
ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాసం మొదలు. ఫాల్గుణ మాసం అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. ఫాల్గుణ శుద్ధ పక్షంలో పయో వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేయడం వలన విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ వ్రతం చేసే వారు విష్ణువుకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణంలో చెప్పబడింది.
రేపటితో మాఘమాసం పూర్తి కాబోతోంది. రేపు మాఘ అమావాస్య. తర్వాత రోజు నుంచి కూడా ఫాల్గుణ మాసం మొదలవుతుంది. ఫాల్గుణ మాసం అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. ఫాల్గుణ శుద్ధ పక్షంలో పయో వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేయడం వలన విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ వ్రతం చేసే వారు విష్ణువుకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అలా చేయడం వలన అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణంలో చెప్పబడింది. ఆదితి పయో వ్రతం ఆచరించి వామనుడిని కుమారుడిగా పొందింది.

ఫాల్గుణ మాసంలో ఏం చేస్తే మంచిది?
ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాసం మొదలు అవుతుంది. ఫాల్గుణ మాసంలో ధన దానం, గోదానం, వస్త్రదానం వంటివి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. ఇదే చివరి మాసం కాబట్టి ఈ పనులు కచ్చితంగా చేయండి. దీంతో శుభ ఫలితాలను పొందవచ్చు.
ఫాల్గుణ మాసం విశిష్టత
ఫాల్గుణ మాసంలో రావణుడితో యుద్ధం చేయడానికి వానర సైన్యంతో శ్రీరాముడు లంకకు వెళ్లాడు. త్రయోదశి దాకా యుద్ధం కొనసాగింది. రావణుడిని రాముడు అమావాస్య నాడు వధించాడు. అయ్యప్ప స్వామి, పాలకడలి నుంచి, లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలోనే జన్మించారట. అంతే కాకుండా శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస వంటి వారు కూడా ఈ మాసంలోనే జన్మించారు. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు ధర్మరాజు జన్మించారు. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారు.
ఫాల్గుణ మాసం
ఫాల్గుణ మాసం విశిష్టత ఏమిటంటే, చంద్రుడు పౌర్ణమి రోజు ఉత్తర లేదా పూర్వ ఫాల్గుణి నక్షత్రానికి దగ్గరగా ఉండే నెలను ఈ ఫాల్గుణ మాసం అంటారు. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఫాల్గుణి. అందుకే అర్జునుడిని ఫాల్గునుడు అని కూడా అంటారు.
ఫాల్గుణ మాసంలో వచ్చే ముఖ్య తిధులు
- ఫాల్గుణ మాసంలో ఉన్న తిథుల విశిష్టత ఏమిటంటే, ఫాల్గుణ శుద్ధ చవితి నాడు సంకట గణేశ్ వ్రతాన్ని ఆచరిస్తారు.
- అలాగే ఫాల్గుణ బహుళ అష్టమి నాడు సీత భూమి నుంచి ఆవిర్భవించారని చెబుతారు. అందుకే ఆ రోజు రామాయణం చదవాలని చెబుతారు. సీతారాములను ప్రార్థిస్తారు. బహుళ అమావాస్య నాడు పితృ దేవతలకు పిండ ప్రధానం చేస్తే మంచిది. అలాగే ఆ రోజు అన్నదానం కూడా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.
- హోలీ పండుగ ఫాల్గుణ మాసంలో వస్తుంది. శివుడు, మన్మధుడు, లక్ష్మీదేవి, కృష్ణుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సుఖ సంతోషాలను పొందవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


