...
...
Next Story

Annapurna Jayanthi: రేపే అన్నపూర్ణ జయంతి.. గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఏం చెయ్యాలి? దానాలు, నైవేద్యాలు వివరాలు ఇవే!

అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 4, గురువారం వచ్చింది. ఈ రోజున కొన్ని పద్ధతులను పాటించడం వలన ఆహారానికి లోటు ఉండదు, అనేక సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది.

Published on: Dec 3, 2025, 10:00:10 IST
Advertisement

Annapurna Jayanthi 2025: ప్రతి ఏటా మార్గశిర మాసంలో (Margasira Masam) వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాము. పార్వతి దేవి రూపమైనటువంటి అన్నపూర్ణని ఆ రోజు ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజూ అన్నపూర్ణ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే ఆహారానికి లోటు ఉండదు. ఈ ఏడాది అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వచ్చింది? అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి? ఏ విధమైన పరిహారాలను పాటిస్తే అన్నపూర్ణ అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ జయంతి 2025 ఎప్పుడు వచ్చింది?

Annapurna Jayanthi 2025: అన్నపూర్ణ జయంతి 2025 ఎప్పుడు వచ్చింది? (pinterest)
Annapurna Jayanthi 2025: అన్నపూర్ణ జయంతి 2025 ఎప్పుడు వచ్చింది? (pinterest)

అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 4, గురువారం వచ్చింది. ఈ రోజున కొన్ని పద్ధతులను పాటించడం వలన ఆహారానికి లోటు ఉండదు, అనేక సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది.

అన్నపూర్ణ జయంతి నాడు ఇలా చేస్తే మంచిది:

అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధించాలి. ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడూ నిండి ఉండాలంటే కొన్ని వస్తువులను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. అన్నపూర్ణ జయంతి నాడు ప్రత్యేకంగా కొన్నిటిని దానం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను దానం చేయడం వలన సంపద పెరుగుతుంది.

  1. అన్నపూర్ణ జయంతి నాడు బియ్యాన్ని దానం చేయడం వలన సంపద పెరుగుతూ ఉంటుంది.
  2. ఈ పవిత్ర దినాన మినుముల దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. మినుములు శని గ్రహానికి సంబంధించినవి. అన్నపూర్ణ జయంతి నాడు వీటిని దానం చేస్తే శని బాధలు తగ్గిపోతాయి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి, స్థిరత్వం ఉంటుంది, క్రమశిక్షణ, సహనం కూడా పెరుగుతాయి.
  3. అన్నపూర్ణ జయంతి నాడు ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహువు బలపడతాడు, ఆనందంగా ఉండొచ్చు. రాహువు కారణంగా ఎలాంటి దోషాలు రావు.
  4. ఈ రోజున గోధుమలను దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుంది, సూర్యగ్రహం కూడా బలపడుతుంది. గోధుమలను దానం చేయడం వలన తండ్రికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చూస్తారు, సానుకూల శక్తి కూడా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అన్నపూర్ణ జయంతి నాడు నైవేద్యం:

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks