ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రసిద్ధ శివాలయాలు.. కార్తీక మాసంలో దర్శించాల్సిన 8 క్షేత్రాలు.. మీరు ఎన్ని సందర్శించారు?

కార్తీక మాసంలో శివుడిని దర్శించుకోవడం, ఆలయాల్లో దీపాలు వెలిగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ శివాలయాలను సందర్శిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత, భక్తి భావం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.  

Published on: Nov 28, 2026, 13:00:14 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కార్తీక మాసం అంటే శివారాధన, దీపాల వెలుగు, పవిత్ర స్నానాలకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో శివాలయాలను సందర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే శివాలయాలను భక్తులు సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూడాల్సిన ప్రముఖ శివక్షేత్రాలు ఇవి. చారిత్రక ప్రాధాన్యత, అద్భుతమైన నిర్మాణ శైలితో ఆకట్టుకునే ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖ శివాలయాల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రసిద్ధ శివాలయాలు.. కార్తీక మాసంలో దర్శించాల్సిన 8 క్షేత్రాలు..  మీరు ఎన్ని సందర్శించారు? (AI)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రసిద్ధ శివాలయాలు.. కార్తీక మాసంలో దర్శించాల్సిన 8 క్షేత్రాలు.. మీరు ఎన్ని సందర్శించారు? (AI)

కార్తీక మాసంలో మీరు కూడా ప్రముఖ శివాలయాలను సందర్శించాలనుకుంటే వీటిని సందర్శించవచ్చు. కార్తీక మాసంలో చూడాల్సిన ప్రముఖ శివక్షేత్రాలు, ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల వివరాలు ఇవే.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం:

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం చాలా విశేషమైనది. నల్లమల అడవుల మధ్య, కృష్ణా నది తీరాన ఈ ఆలయం వెలసింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఇక్కడ కార్తీక దీపాలను వెలిగిస్తారు. శివనామస్మరణ, అభిషేకాలతో భక్తులు నిమగ్నమైపోతారు. పాతాళగంగను కూడా సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం

ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం:

ఏపీలోని కోనసీమ ప్రాంతంలో ఉన్న ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడికి కూడా చాలా మంది కార్తీక మాసంలో సందర్శిస్తారు. భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవారి ఆరాధనకు ఈ ఆలయం ప్రసిద్ధి. ఎత్తైన ఆలయ ప్రాంగణం, పురాతన నిర్మాణ శైలి అందరినీ ఆకట్టుకుంటాయి. కార్తీక మాసంలో ద్రాక్షారామాన్ని సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా శివభక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో అభిషేకాలు, దీపారాధన, శివపూజలు ఘనంగా జరుగుతాయి.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం:

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడికి కూడా దూర ప్రాంతాల నుంచి భక్తులు కార్తీక మాసంలో వస్తూ ఉంటారు. ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ధర్మగుండం కూడా, కోడె మొక్కు సంప్రదాయాలు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కార్తీక మాసంలో కార్తీక దీపాలను వెలిగించి, శివుడికి అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి శివదర్శనం చేసుకోవాలనుకుంటే ఈ ఆలయం కూడా అద్భుతంగా ఉంటుంది.

రామప్ప ఆలయం:

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. రుద్రేశ్వర స్వామి ఆలయంగా దీనిని పిలుస్తారు. కాకతీయుల నిర్మాణ కళకు గొప్ప ఉదాహరణ ఈ రామప్ప ఆలయం. రాతి నిర్మాణంతో అందరినీ ఆకట్టుకుంటుంది. కార్తీక మాసంలో ఇక్కడికి కూడా దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. శివదర్శనం చేసుకోవడంతో పాటుగా శిల్పకళను కూడా దగ్గరగా చూడడానికి వీలవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక మాసంలో ఈ ఆలయానికి కూడా వెళ్లి రావచ్చు.

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప ఆలయం

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం:

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ ఆలయం కూడా ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. గోదావరి నది పరిసరాలతో అనుసంధానమై ఈ ఆలయం ఉండడంతో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. కార్తీక మాసంలో భక్తులు శివ దర్శనం చేసుకుని దీపారాధన, అభిషేకాలు వంటి వాటిలో పాల్గొంటారు. కాళేశ్వరం ఆలయ దర్శనం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది.

శ్రీకాళహస్తి ఆలయం:

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం కూడా ప్రసిద్ధ శివక్షేత్రాల్లో ఒకటి. పంచభూత స్థలాల్లో వాయు లింగ క్షేత్రంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్లాలనుకుంటే కుటుంబంతో వెళ్లి దర్శించుకుని రావచ్చు. ఈ నెలలో అభిషేకాలు, దీపారాధనలు, శివదర్శనం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తారు. ఈ ఆలయం రాహుకేతు పూజలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం

మహానంది ఆలయం:

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది ఆలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. నల్లమల ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం అందరినీ ఆకట్టుకుంటుంది. పవిత్ర జలాశయాలు, ప్రకృతి అందాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది. కార్తీక సోమవారాల్లో ఈ ఆలయంలో శివపూజలు, దీపారాధనలు చేయడం ఎంతో విశేషంగా భావిస్తారు.

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు