పిల్లల పాత బట్టలతో ఇల్లు తుడుస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?

ఇల్లు తుడవడానికి పిల్లల పాత బట్టలను వాడుతున్నారా? లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమయ్యే ఈ అలవాటు వెనుక ఉన్న అసలు నిజాలు, వాస్తు నియమాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 5, 2026, 11:01:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. అయితే మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో పాత, చిరిగిపోయిన బట్టలను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. చాలా మంది పాత బట్టలతో ఇల్లు తుడుస్తారు. కిటికీలు, ఫ్యాన్లు వంటివి దులుపుకోవడానికి కూడా వాటిని ఉపయోగిస్తారు. అయితే పాత బట్టలతో ఇల్లు తుడవచ్చా? పిల్లల పాత బట్టలతో ఇల్లు తుడవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల పాత బట్టలతో ఇల్లు తుడుస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? (pinterest)
పిల్లల పాత బట్టలతో ఇల్లు తుడుస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? (pinterest)

నష్టాలు కలిగే అవకాశం ఉంది

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే పాత బట్టలతో ఇల్లు తుడుచుకోవడం మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు కారణంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల బట్టలతో కూడా ఇల్లు తుడవడం మంచిది కాదు. దాని వలన కూడా చాలా నష్టాలు ఉంటాయని చెబుతారు.

రాహువు దోషాలు

చిన్నపిల్లల బట్టలను నేల తుడవడానికి ఏ మాత్రం ఉపయోగించకూడదు. పిల్లల దుస్తులు అదృష్టానికి, కుటుంబానికి ప్రతీకగా భావిస్తారు. చిన్నపిల్లల బట్టలతో ఇల్లు తుడవడం వలన జాతకంలో రాహువు బలహీనమైపోతుందని నమ్మకం. దీంతో జీవితం మారిపోయే అవకాశం ఉంది. అకస్మాత్తుగా సమస్యలు కూడా రావచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి వేధించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కూడా ఈ చిన్న పొరపాటు వలన కలగవచ్చు.

ప్రతికూల శక్తి

చిరిగిపోయిన పాత బట్టలతో ఇల్లు తుడవడం ఏమాత్రం మంచిది కాదు. దీంతో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని చెబుతారు. కాబట్టి ఈ తప్పు చేయకండి. అంతేకాకుండా అనవసరంగా అలసిపోవడం, ఓపిక లేకపోవడం, అసంతృప్తి వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆర్థిక సమస్యలు

పొరపాటున కూడా పాత, చిరిగిపోయిన బట్టలతో ఇల్లు తుడవకూడదు. ఎందుకంటే ఇలాంటి బట్టలను కుప్పలుగా నిల్వ చేస్తే ఇల్లు శుభ్రంగా ఉండదు. దాని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే వాటితో ఇల్లును శుభ్రం చేయడం వలన లక్ష్మీదేవి ఇంటిని విడిచిపోతుందని కూడా చెబుతారు. ఎంత సంపాదించినా మీ చేతిలో డబ్బు నిలవకపోవచ్చు.

పాత బట్టలను ఏం చేస్తే మంచిది?

ఇంట్లో సానుకూల శక్తి ఉండి, ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే పాత బట్టల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పూర్తిగా చిరిగిపోయి పనికిరాని బట్టలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వేసుకోవడానికి వీలుగా ఉన్న పాత బట్టలను ఉతికి ఎవరికైనా దానంగా ఇస్తే మంచిది. అప్పుడు పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా జాతకంలో గ్రహాల అనుకూలత కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.

ఇల్లు తుడవడానికి వేటిని ఉపయోగించాలి?

ఇల్లు తుడవడానికి మాప్ స్టిక్స్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌లను ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వలన వాస్తు పరంగా ఇబ్బందులు రావు. సానుకూల శక్తి కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More