రాబోయే 7 నెలల పాటు ఈ రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు, కుంభరాశిలో రాహువు సంచారంతో లాభాల పంట!

రాహువు కుంభరాశిలో సంచరిస్తున్న కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. వచ్చే 7 నెలల పాటు వీరి జీవితంలో అనూహ్య మార్పులు, ధనలాభం చోటుచేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Published on: May 26, 2026, 08:13:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా రాహువు అంటేనే భయం, గందరగోళం అని చాలా మంది భావిస్తారు. అయితే, జాతకంలో రాహువు గనుక శుభ స్థానంలో లేదా బలమైన స్థితిలో ఉంటే.. అదృష్టం మామూలుగా ఉండదు. అనూహ్యమైన ధనలాభం, కెరీర్‌లో ఊహించని విజయం, సమాజంలో ఉన్నత హోదా దక్కుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

రాబోయే 7 నెలల పాటు ఈ రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు, కుంభరాశిలో రాహువు సంచారంతో లాభాల పంట! (pinterest)
రాబోయే 7 నెలల పాటు ఈ రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు, కుంభరాశిలో రాహువు సంచారంతో లాభాల పంట! (pinterest)

ప్రస్తుతం రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం వరకు ఆయన ఇదే రాశిలో ఉంటాడు. కుంభం వాయు తత్వానికి చెందిన రాశి, రాహువు కూడా వాయు తత్వ గ్రహమే. ఈ కలయిక వల్ల రాహువు మరింత శక్తివంతంగా మారుతున్నాడు. దీనివల్ల వచ్చే 7 నెలల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం పండనుంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.

కుంభరాశిలో రాహువు సంచారం.. 7 నెలల పాటు అదృష్టం

1.మిథున రాశి

మిథున రాశి వారికి రాహువు కుంభ సంచారం ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు, రాహువు మధ్య మంచి మిత్రత్వం ఉంటుంది. మీరు గత కొంతకాలంగా పడ్డ కష్టానికి ఫలితం రావడం లేదని బాధపడుతుంటే.. ఇక ఆ దిగులు వదిలేయండి. ఇప్పుడు అదృష్టం మీ తలుపు తట్టనుంది.

తక్కువ శ్రమతోనే పెద్ద పనులు పూర్తవుతాయి. విదేశాల్లో చదువుకోవాలన్నా లేదా అక్కడ ఉద్యోగం సంపాదించాలన్నా మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

2.తులా రాశి

తులా రాశి వారికి రాహువు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీ జీవితంలో కీలక మార్పులకు కారణమవుతుంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

అయితే, పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. మీరు గనుక క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటే.. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అవివాహితుల జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. మీ ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి రాహువు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇది సుఖ సంతోషాలను పెంచే స్థానం. ఈ సమయంలో మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇల్లు, స్థలం లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది.

ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి పదవీ యోగం కనిపిస్తోంది. శత్రువులు మీపై పైచేయి సాధించలేరు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రాహువు శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. ఏ నిర్ణయమైనా తొందరపాటుతో తీసుకోకూడదు. అహంకారం తలకెక్కకుండా చూసుకోవాలి.

రాహువు ప్రభావం మరింత అనుకూలంగా ఉండాలంటే క్రమం తప్పకుండా శివుడిని ఆరాధించడం మంచిది. "ఓం రాహవే నమః" అనే మంత్రాన్ని జపించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోయి మంచి జరుగుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం ఇచ్చింది మాత్రమే. వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఉత్తమం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More