కొందరికి 25 ఏళ్ల వయసు నుంచి పెళ్లి సంబంధాలు చూసినా.. అస్సలు సెట్ కావు. 30 ఏళ్లు వచ్చేసరికి ఇక పూజలు చేయడం మెుదలుపెడతారు. దాదాపు తిరగని గుడి లేదన్నట్టుగా వెళ్తుంటారు. చాలా మంది వివాహ విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మాయి గానీ అబ్బాయి గానీ దొరకడం లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి.. సంబంధాలు వచ్చినా.. జాతకాలకు సరిగా లేవని ఆగిపోతుంటాయి. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ఆలయాలకు వెళ్తే పెళ్లి అవుతుందని నమ్మకం. ఆ ఆలయాలు ఏంటో చూద్దాం..
మంగళాదేవి ఆలయం

ఇది 9వ శతాబ్దానికి చెందిన పురాతన శక్తి ఆలయం. ఈ దేవత పేరు మీదుగానే మంగళూరు నగరానికి ఆ పేరు వచ్చింది. మంగళూరు దేవత అయిన మంగళా దేవి దర్శనం జీవితంలో శుభాన్ని చేకూరుస్తుంది. అమ్మాయిలు మంచి భర్త కలగాలని, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇక్కడ పూజలు చేస్తారు.
పార్వతీ పరమేశ్వర ఆలయం
మంగళూరులోని ఉల్లాల్‌లో ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంవైవాహిక దోషాలను తొలగించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. పార్వతీ, పరమేశ్వరులు వివాహానికి పరమ ప్రతీకలు కాబట్టి, ఇక్కడ నిర్వహించే స్వయంవర పార్వతీ హోమం చాలా శక్తివంతమైనదని భక్తులు చెబుతున్నారు.
ఇస్కాన్ టెంపుల్
బెంగళూరులో సుందరమైన ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయం ఉంది. కేవలం దర్శనానికే కాకుండా, భక్తుల కష్టాలను తీర్చడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాధాకృష్ణులకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం వల్ల ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయని, వివాహంలోని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
కిక్కేరి శ్రీ బ్రహ్మేశ్వరాలయం
మాండ్యా జిల్లాలోని కిక్కేరిలో ఉన్న ఈ పురాతన ఆలయం శిల్పా సంపదకే కాకుండా, దాని పవిత్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దపు హోయసల నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ ఇది. ఇక్కడి దేవునికి ఒక ప్రత్యేక అభిషేకం చేయడం వల్ల వివాహంలోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కలుగుతుందని అంటుంటారు.
మహాబలేశ్వర దేవాలయం
ఆత్మలింగ నిలయమైన గోకర్ణ అన్ని దోషాల నుండి ఉపశమనం కలిగించే గొప్ప ప్రదేశమని అంటారు. జాతకంలో కుజ దోషం లేదా మాంగల్య దోషం కారణంగా వివాహం ఆలస్యమైతే, ఇక్కడ ప్రత్యేక పూజ, శాంతి హోమం చేయడం ద్వారా వివాహ త్వరగా అవుతుందని నమ్మకం.
నిమిషాంబ దేవాలయం, శ్రీరంగపట్నం
{{/usCountry}}ఆత్మలింగ నిలయమైన గోకర్ణ అన్ని దోషాల నుండి ఉపశమనం కలిగించే గొప్ప ప్రదేశమని అంటారు. జాతకంలో కుజ దోషం లేదా మాంగల్య దోషం కారణంగా వివాహం ఆలస్యమైతే, ఇక్కడ ప్రత్యేక పూజ, శాంతి హోమం చేయడం ద్వారా వివాహ త్వరగా అవుతుందని నమ్మకం.
నిమిషాంబ దేవాలయం, శ్రీరంగపట్నం
{{/usCountry}}మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం సమీపంలోని నిమిషాంబ అమ్మవారు తన భక్తుల కోరికలను తీరుస్తారని నమ్ముతారు. పెళ్లి సంబంధాలు పదేపదే విఫలమవుతుంటే.. అక్కడ అమ్మవారికి చీర, గాజులు సమర్పించి, మొక్కు చెల్లించుకుంటే సుకుంటే అదృష్టం కలుగుతుందని చెబుతారు.