ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, జ్ఞాపకశక్తి పెరగాలని, ఏకాగ్రతతో పాటు ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు రావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోతారు. కొంతమంది బాగా మొండితనంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.

మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, మంచి బుద్ధులతో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారా? అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, చదువు, జ్ఞాపకశక్తి అనేవి జాతకంలో చంద్రుడు, బుధుడు, గురు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఈ గ్రహాల బలహీనత వలన పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది, కోపం పెరుగుతుంది. ఈ గ్రహాలు బలంగా ఉండాలంటే, పిల్లల్లో మార్పులు తీసుకురావాలంటే జ్యోతిష్య పరిహారాలను పాటించండి.
ఈ బుధ పరిహారాలతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందించచ్చు
బుధ గ్రహాన్ని బుద్ధి, విద్యా కారకుడు అని అంటారు. బుధుడి అనుగ్రహం పిల్లలపై ఉంటే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించడం లేదా పచ్చ పెసలను దానం చేయడం వలన బుధుడు బలపడతాడు. బుధ దోషాలు తొలగిపోతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తింటే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.
పిల్లలు చదివే గదిలో సరస్వతి దేవి ఫోటోను పెట్టండి. చదవడానికి ముందు "ఓం బుధాయ నమః", "సరస్వతీ గాయత్రి మంత్రం"ను మూడు సార్లు చదువుకునేటట్టు చేయండి.
మొండితనం తగ్గి, ప్రవర్తన బాగుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలి
పిల్లలకు కోపం, మొండితనం ఎక్కువగా ఉంటే పెద్దల మాటలను పట్టించుకోరు. చంద్రుడి ప్రభావం తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. మనసుకు కారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం ఈ పరిహారాలను పాటించండి. ప్రతిరోజూ పిల్లలు నిద్రపోవడానికి ముందు హనుమాన్ చాలీసాను చదివించండి లేదా వినేలా చేయండి. దీంతో భయం తగ్గి, క్రమశిక్షణ అలవాటు అవుతుంది.
{{/usCountry}}పిల్లలకు కోపం, మొండితనం ఎక్కువగా ఉంటే పెద్దల మాటలను పట్టించుకోరు. చంద్రుడి ప్రభావం తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. మనసుకు కారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం ఈ పరిహారాలను పాటించండి. ప్రతిరోజూ పిల్లలు నిద్రపోవడానికి ముందు హనుమాన్ చాలీసాను చదివించండి లేదా వినేలా చేయండి. దీంతో భయం తగ్గి, క్రమశిక్షణ అలవాటు అవుతుంది.
{{/usCountry}}మంచి ప్రవర్తన అలవడుతుంది. అలాగే సోమవారం పిల్లల చేత శివలింగానికి నీళ్లు లేదా పాలను సమర్పించేటట్టు చూడండి. పిల్లల మెడలో చిన్న వెండి గొలుసు లేదా వెండి లాకెట్ వేయండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కోపాన్ని తగ్గిస్తుంది.
శారీరక ఎదుగుదలకు సూర్యుని ఆరాధన
పిల్లల శారీరక ఎదుగుదల, శక్తి పెంచడానికి నవగ్రహాల అధిపతి అయిన సూర్యుని అనుగ్రహం చాలా ముఖ్యం. ప్రతిరోజూ 11 సార్లు పిల్లలు గాయత్రి మంత్రాన్ని చదివితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, తేజస్సు, శారీరక శక్తి పెరుగుతాయి. అలాగే సూర్యకాంతిలో పిల్లలు కాసేపు ఆడుకునేటట్టు చూడండి. ఉదయం పూట పిల్లలు కాసేపు సూర్య నమస్కారాలు చేస్తే కూడా మంచిదే. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే పిల్లల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది.
గురు గ్రహం బలపడాలంటే ఇలా చేయండి
గురు గ్రహం బలపడాలంటే గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయాలి. పేద పిల్లలకు పసుపు రంగులో ఉండే స్వీట్లను దానం చేయడం మంచిది. దీని వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.