ఎంత చెప్పినా పిల్లలు మాట వినట్లేదా? ఈ 5 పరిహారాలతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ప్రవర్తనలో అద్భుత మార్పు!
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడానికి, వారి ప్రవర్తనలో సానుకూల మార్పుల కోసం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన సులభమైన, అత్యంత ప్రభావంతమైన పరిహారాల పూర్తి వివరాలు. ఈ గ్రహాల బలహీనత కారణంగా పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది.
ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, జ్ఞాపకశక్తి పెరగాలని, ఏకాగ్రతతో పాటు ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు రావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోతారు. కొంతమంది బాగా మొండితనంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.

మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, మంచి బుద్ధులతో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారా? అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, చదువు, జ్ఞాపకశక్తి అనేవి జాతకంలో చంద్రుడు, బుధుడు, గురు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఈ గ్రహాల బలహీనత వలన పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది, కోపం పెరుగుతుంది. ఈ గ్రహాలు బలంగా ఉండాలంటే, పిల్లల్లో మార్పులు తీసుకురావాలంటే జ్యోతిష్య పరిహారాలను పాటించండి.
ఈ బుధ పరిహారాలతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందించచ్చు
బుధ గ్రహాన్ని బుద్ధి, విద్యా కారకుడు అని అంటారు. బుధుడి అనుగ్రహం పిల్లలపై ఉంటే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించడం లేదా పచ్చ పెసలను దానం చేయడం వలన బుధుడు బలపడతాడు. బుధ దోషాలు తొలగిపోతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తింటే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.
పిల్లలు చదివే గదిలో సరస్వతి దేవి ఫోటోను పెట్టండి. చదవడానికి ముందు "ఓం బుధాయ నమః", "సరస్వతీ గాయత్రి మంత్రం"ను మూడు సార్లు చదువుకునేటట్టు చేయండి.
మొండితనం తగ్గి, ప్రవర్తన బాగుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలి
పిల్లలకు కోపం, మొండితనం ఎక్కువగా ఉంటే పెద్దల మాటలను పట్టించుకోరు. చంద్రుడి ప్రభావం తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. మనసుకు కారకుడైన చంద్రుడి అనుగ్రహం కోసం ఈ పరిహారాలను పాటించండి. ప్రతిరోజూ పిల్లలు నిద్రపోవడానికి ముందు హనుమాన్ చాలీసాను చదివించండి లేదా వినేలా చేయండి. దీంతో భయం తగ్గి, క్రమశిక్షణ అలవాటు అవుతుంది.
మంచి ప్రవర్తన అలవడుతుంది. అలాగే సోమవారం పిల్లల చేత శివలింగానికి నీళ్లు లేదా పాలను సమర్పించేటట్టు చూడండి. పిల్లల మెడలో చిన్న వెండి గొలుసు లేదా వెండి లాకెట్ వేయండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కోపాన్ని తగ్గిస్తుంది.
శారీరక ఎదుగుదలకు సూర్యుని ఆరాధన
పిల్లల శారీరక ఎదుగుదల, శక్తి పెంచడానికి నవగ్రహాల అధిపతి అయిన సూర్యుని అనుగ్రహం చాలా ముఖ్యం. ప్రతిరోజూ 11 సార్లు పిల్లలు గాయత్రి మంత్రాన్ని చదివితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, తేజస్సు, శారీరక శక్తి పెరుగుతాయి. అలాగే సూర్యకాంతిలో పిల్లలు కాసేపు ఆడుకునేటట్టు చూడండి. ఉదయం పూట పిల్లలు కాసేపు సూర్య నమస్కారాలు చేస్తే కూడా మంచిదే. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే పిల్లల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది.
గురు గ్రహం బలపడాలంటే ఇలా చేయండి
గురు గ్రహం బలపడాలంటే గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయాలి. పేద పిల్లలకు పసుపు రంగులో ఉండే స్వీట్లను దానం చేయడం మంచిది. దీని వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


