ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. చాలామంది ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో వర్షాలు కూడా పడతాయి. అయితే ఆషాఢ మాసం ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. అలాగే ఆషాఢంలో కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. మరి కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఆషాఢ మాసంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఆషాఢ మాసం విశేషాలతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శుభకార్యాలు జరపరు

శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే, ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. ముఖ్యంగా పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరపకూడదని చెబుతారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా కొంతకాలం దూరంగా ఉండాలని, పెళ్లయిన అమ్మాయి పుట్టింటికి వెళ్లాలని పెద్దలు అంటారు. అలాగే ఈ కాలంలో అత్తా-కోడళ్ల మధ్య మనస్పర్థలు, గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే అత్తగారు, కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దలు చెబుతారు.
ఆషాఢ మాసం అంటే అనారోగ్య మాసమా?
ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసంగా కూడా భావిస్తారు. ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయి. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు కలుషితమవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు.
ఆషాఢంలో కొత్త నీరు తాగితే జ్వరాలు, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఈ నెలలో మహిళలు గర్భం దాల్చడం మంచిది కాదాని విశ్వాసం ఉంది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ఉద్దేశంతో అలాంటి సూచనలు చేశారని చెబుతారు.
ఆషాఢ మాసం విశేషాలు
ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయని ఏకాదశి అని అంటారు. చాతుర్మాసం కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది.
తెలంగాణలో అయితే బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆషాఢం అంటే ఏంటి?
{{/usCountry}}తెలంగాణలో అయితే బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆషాఢం అంటే ఏంటి?
{{/usCountry}}ఆషాఢం అంటే అజేయమైనది, అపరాజితమైనది అనే అర్థాలు ఉన్నాయి. అందుకే ఆషాఢ మాసాన్ని విజయం, మానసిక దృఢత్వానికి ప్రతీకగా పెద్దలు పేర్కొంటారు.
గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
ఆషాఢ మాసంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. పిల్లలు, పెద్దలు అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. దీని వెనుక ఆరోగ్య సంబంధిత కారణం కూడా ఉంది.
వానాకాలం ప్రారంభమైనప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. దీంతో శరీరంలో పిత్త దోషం పెరుగుతుందని ఆయుర్వేదంలో చెబుతారు. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని అధిక ఉష్ణం తగ్గి చల్లదనం లభిస్తుంది. ఔషధ గుణాలు ఉన్న గోరింటాకు కాళ్లు, చేతుల చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందని, అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు.
ఆషాఢ మాసంలో ఏం చేయాలి?
ఆషాఢ మాసంలో దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతారు. అలాగే జపాలు, పారాయణాలు, దేవుని ఆరాధన చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
గురు పూర్ణిమ
ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గురు పూర్ణిమను జరుపుకుంటాము. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆ రోజు పూజించడం వల్ల అనేక విధాలుగా శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు.