Wealth Remedies: ఆర్థిక ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలా? పెద్దలు చెప్పిన ఈ జ్యోతిష్య పరిహారాలు తెలుసుకోండి!
జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, పనుల్లో ఆటంకాలు, దృష్టి దోషాలు వంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తారు. వ్యాపారంలో వృద్ధి కోసం అమావాస్య లేదా శనివారం నిమ్మకాయలు, ఆవాలు, మిరియాలు, లవంగాలతో ప్రత్యేక పరిహారం చేయాలని చెబుతారు.
చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని జ్యోతిష్య పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. జీవితమంటే కష్టసుఖాల సమరం. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు... ఇలా ఏదో ఒకటి వేధిస్తూ ఉంటుంది. వీటి వెనుక ప్రతికూల శక్తులు, గ్రహస్థితులు, వాస్తు దోషాలు కారణం అవ్వచ్చు. అలాంటప్పుడు వాటి నుంచి బయట పడడానికి, జీవితంలో సుఖసౌభాగ్యాలను పొందడానికి పెద్దలు సూచించిన కొన్ని సులువైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుని పాటించండి.

వ్యాపారంలో వృద్ధి, దృష్టి దోషాలకు ఇలా చేయండి
వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా, ఎవరి దృష్టి తగిలిందో అని భయపడుతున్నా, అమావాస్య లేదా శనివారం ఉదయం నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కోసి, కొన్ని ఆవాలు, మిరియాలు, లవంగాలను మీ వ్యాపార స్థలంలో పెట్టండి. సాయంత్రం అయిన తర్వాత వీటన్నింటినీ నల్లటి వస్త్రంలో చుట్టేసి, ఎవరూ లేని చోట పడేయండి. ప్రతి నెల ఈ పద్ధతిని పాటిస్తే వ్యాపారంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి లాభాలను పొందవచ్చు.
ఆగిపోయిన పనులు పూర్తవ్వాలంటే ఇలా చేయండి
ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవ్వాలని, అనుకున్నవి సకాలంలో జరగాలని కోరుకుంటే, ఇంటి గడప దాటాక వెనక్కి తిరగకుండా నాలుగు అడుగులు వ్యతిరేక దిశలో వేయండి. ఆ తర్వాత గమ్యస్థానం వైపు ప్రయాణాన్ని ప్రారంభించండి. బయలుదేరేటప్పుడు వినాయకుడిని స్మరించుకుని, కొంచెం బెల్లం తిని, నీళ్లు తాగి వెళ్లడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ చిన్న అలవాటు మీ పనుల్లో అడ్డంకులను తొలగించి, విజయ అవకాశాలను పెంపొందిస్తుంది.
కోరికలు నెరవేరాలంటే ఈ పరిహారాన్ని పాటించండి
చాలా మంది కోరికలు అనుకున్నవి జరగక చాలా సతమతమవుతూ ఉంటారు. గురువారం నాడు ఏడు పసుపు కొమ్ములను, ఏడు బెల్లం ముక్కలను, ఒక రూపాయి నాణెాన్ని పసుపు వస్త్రంలో కట్టండి. ఆ మూటను మనసులో కోరికను తలుచుకుంటూ, ఎవరూ లేని చోటకు విసిరేయండి. ఇలా చేస్తే ప్రయత్నాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. కోరిన కోరిక కూడా నెరవేరుతుంది.
సుఖ శాంతుల కోసం ఇలా చేయండి
కుటుంబంలో ప్రశాంతత, సిరి సంపదలు కలగాలంటే ఇది బాగా పనిచేస్తుంది. ప్రతి రోజూ మీరు వండుకున్న మొదటి రొట్టెను లేదా అన్నాన్ని నాలుగు భాగాలుగా విభజించి, మొదటి ముక్కను ఆవుకు, రెండవ దానిని నల్ల కుక్కకు, మూడవ దానిని కాకికి, చివరి నాలుగవ దానిని ఏదైనా కూడలిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోయి, అన్యోన్యత కూడా పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


