Ashtadhatu: అష్టధాతు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యలతో పాటు ఈ సమస్యలు తొలగిపోతాయి.. ఎలా ధరించాలో తెలుసుకోండి!

చాలా మంది వారికి ఏ లోహం కలిసి వస్తుందో తెలుసుకుని ధరిస్తూ ఉంటారు. బంగారం, వెండి, రాగి ఇలా చాలా రకాల లోహాలు ఉన్నాయి. అయితే 8 లోహాలతో కలిపి చేసేది అష్టధాతు. అష్టధాతు సానుకూల శక్తులను తీసుకురావడానికి సహాయం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టధాతు ఉంగరాన్ని ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. 

Published on: Feb 18, 2026, 15:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది శుభ ఫలితాలు కలగాలని, మంచి జరగాలని రకరకాల రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్నాలు జాతకంలో ఉన్న సమస్యలను తొలగించి, అనేక విధాలుగా లాభాలు కలిగేటట్టు చేస్తాయి. అయితే రత్నాలను లేదా ఏదైనా ప్రత్యేక ఉంగరాలను ధరించేటప్పుడు జ్యోతిష్యులను సంప్రదించి ధరించడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Ashtadhatu: అష్టధాతు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యలతో పాటు ఈ సమస్యలు తొలగిపోతాయి (pinterest)
Ashtadhatu: అష్టధాతు ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యలతో పాటు ఈ సమస్యలు తొలగిపోతాయి (pinterest)

చాలా మంది వారికి ఏ లోహం కలిసి వస్తుందో తెలుసుకుని వాటిని ధరిస్తూ ఉంటారు. బంగారం, వెండి, రాగి ఇలా చాలా రకాల లోహాలు ఉన్నాయి. అయితే 8 లోహాలతో కలిపి చేసేది అష్టధాతు. అష్టధాతు సానుకూల శక్తులను తీసుకురావడానికి సహాయం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టధాతు ఉంగరాన్ని ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

అష్టధాతు ఉంగరం

చాలా మంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇలా ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వారికి అష్టధాతు ఉంగరం బాగా కలిసి వస్తుంది. అయితే ఈ ఉంగరాన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి. ఈ ఉంగరాన్ని ఎలా ధరించాలి? ఉంగరాన్ని ధరించే ముందు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అష్టధాతు ఉంగరం వలన కలిగే లాభాలు

అష్టధాతు ఉంగరం ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని కలిగించేటట్టు చేస్తుంది. ఇది తొమ్మిది గ్రహాలను కూడా ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా రాహువు, శనిని ప్రభావితం చేస్తుంది. దీనిని ధరించడం వలన కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. సక్సెస్‌ను అందుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీలవుతుంది.

అష్టధాతు ఉంగరాన్ని ఏ వేలుకి ధరించాలి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం లేదా మంగళవారం నాడు ఈ ఉంగరాన్ని ధరిస్తే మంచిది. పౌర్ణమి నాడు కూడా ఈ ఉంగరాన్ని ధరించడం అనుకూలంగా ఉంటుంది. ఉంగరాన్ని ఉంగరం వేలుకి ధరించడం మంచిది. అలాగే చూపుడు వేలికి ధరిస్తే నాయకత్వ లక్షణాలు, జ్ఞానం పెంపొందించుకోవచ్చు.

ఈ ఉంగరాన్ని ధరించేటప్పుడు తెలుసుకోవాల్సిన నియమాలు:

  • ఈ ఉంగరాన్ని ధరించే ముందు గంగాజలం లేదా పచ్చి పాలతో కడిగి, ఆ తర్వాత పూజ చేసి ధూప, దీపాలను సమర్పించి దేవుడి ముందు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది.
  • ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఉంగరాన్ని ధరించేటప్పుడు తూర్పు ముఖంగా ఉండి ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
  • ఈ ఉంగరాన్ని ధరించిన రోజు మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి. సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More