చాలామంది ఇంట్లో వస్తువులను వాడుతూ ఉంటారు. ఇతరుల నుంచి ఏదైనా నచ్చిన వస్తువులను తీసుకుని వాటిని ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన వస్తువులను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. అలాగే మనకి నచ్చిన వ్యక్తి వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుని వాడడం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం వేటిని ఇతరుల నుంచి తీసుకోకూడదు? ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దురదృష్టం, నష్టాలు రావచ్చు

ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన నష్టాలు కలుగుతాయి, దురదృష్టం కలుగుతుంది, అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
ఇతరుల నుంచి ఈ వస్తువులను పొరపాటున కూడా తీసుకోవద్దు
వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇతరుల నుంచి వస్తువులను తీసుకుని వేసుకోవడం మంచిది కాదు. దీని వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి మీరూ ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి.
1.ఆభరణాలు:
ఎప్పుడూ కూడా ఇతరుల ఆభరణాలు తీసుకుని వేసుకోకూడదు. మీ ఆభరణాలు ఇతరులకు ఇవ్వకండి. అలాగే ఇతరుల ఆభరణాలు మీరు తీసుకుని ధరించకండి. ఉంగరం, గొలుసు ఇలా ఏదైనా రత్నాలు, లోహాలు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి మంచి చేసేవి, మీకు మంచి చేయకపోవచ్చు. కాబట్టి ఇతరుల నుంచి వాటిని తీసుకుని ధరించడం మంచిది కాదు.
2.చెప్పులు:
చెప్పులు, షూ వంటివి శని దేవుడితో సంబంధం కలిగి ఉంటాయి. ఇతరుల చెప్పులు, షూ వంటివి తీసుకుని వేసుకుంటే శని దేవుడికి కోపం వస్తుంది. ఇంట్లో పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది, కష్టాలు ఎదురవుతాయి, పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి ఇతరుల నుంచి ఎప్పుడూ కూడా చెప్పులు, షూ వంటివి తీసుకుని వేసుకోవద్దు.
3.దుస్తులు:
ఇతరుల దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఇది అనారోగ్య సమస్యలను కూడా కలిగించవచ్చు. వారికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే అది సోకే అవకాశం ఉంది. అలాగే దుస్తులు ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇతరుల దుస్తులు వేసుకోవడం వలన నెగటివ్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే, వాటిని ఉప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి వేసుకోవడం మంచిది.
4.వాచీలు:
{{/usCountry}}ఇతరుల దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఇది అనారోగ్య సమస్యలను కూడా కలిగించవచ్చు. వారికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే అది సోకే అవకాశం ఉంది. అలాగే దుస్తులు ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇతరుల దుస్తులు వేసుకోవడం వలన నెగటివ్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే, వాటిని ఉప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి వేసుకోవడం మంచిది.
4.వాచీలు:
{{/usCountry}}ఇతరుల వాచీలను తీసుకుని పెట్టుకోవడం మంచిది కాదు. ఇతరుల వాచీలను వాడడం వలన కష్టాలు, సమస్యలు వస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల వాచీలను మీరు పెట్టుకోవద్దు.