Astro Tips: ఇతరుల నుంచి ఈ వస్తువులను పొరపాటున కూడా తీసుకోవద్దు..అనేక సమస్యలు వచ్చే అవకాశం!
మనకి నచ్చిన వ్యక్తి వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుని వాడడం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం వేటిని ఇతరుల నుంచి తీసుకోకూడదు? ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి తెలుసుకుందాం.
చాలామంది ఇంట్లో వస్తువులను వాడుతూ ఉంటారు. ఇతరుల నుంచి ఏదైనా నచ్చిన వస్తువులను తీసుకుని వాటిని ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన వస్తువులను ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. అలాగే మనకి నచ్చిన వ్యక్తి వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుని వాడడం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం వేటిని ఇతరుల నుంచి తీసుకోకూడదు? ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దురదృష్టం, నష్టాలు రావచ్చు
ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన నష్టాలు కలుగుతాయి, దురదృష్టం కలుగుతుంది, అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
ఇతరుల నుంచి ఈ వస్తువులను పొరపాటున కూడా తీసుకోవద్దు
వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇతరుల నుంచి వస్తువులను తీసుకుని వేసుకోవడం మంచిది కాదు. దీని వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి మీరూ ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి.
1.ఆభరణాలు:
ఎప్పుడూ కూడా ఇతరుల ఆభరణాలు తీసుకుని వేసుకోకూడదు. మీ ఆభరణాలు ఇతరులకు ఇవ్వకండి. అలాగే ఇతరుల ఆభరణాలు మీరు తీసుకుని ధరించకండి. ఉంగరం, గొలుసు ఇలా ఏదైనా రత్నాలు, లోహాలు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి మంచి చేసేవి, మీకు మంచి చేయకపోవచ్చు. కాబట్టి ఇతరుల నుంచి వాటిని తీసుకుని ధరించడం మంచిది కాదు.
2.చెప్పులు:
చెప్పులు, షూ వంటివి శని దేవుడితో సంబంధం కలిగి ఉంటాయి. ఇతరుల చెప్పులు, షూ వంటివి తీసుకుని వేసుకుంటే శని దేవుడికి కోపం వస్తుంది. ఇంట్లో పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది, కష్టాలు ఎదురవుతాయి, పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి ఇతరుల నుంచి ఎప్పుడూ కూడా చెప్పులు, షూ వంటివి తీసుకుని వేసుకోవద్దు.
3.దుస్తులు:
ఇతరుల దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఇది అనారోగ్య సమస్యలను కూడా కలిగించవచ్చు. వారికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే అది సోకే అవకాశం ఉంది. అలాగే దుస్తులు ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇతరుల దుస్తులు వేసుకోవడం వలన నెగటివ్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే, వాటిని ఉప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి వేసుకోవడం మంచిది.
4.వాచీలు:
ఇతరుల వాచీలను తీసుకుని పెట్టుకోవడం మంచిది కాదు. ఇతరుల వాచీలను వాడడం వలన కష్టాలు, సమస్యలు వస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల వాచీలను మీరు పెట్టుకోవద్దు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


