జంతువులకి సేవ చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. హిందూ ధర్మంలో జీవ కారుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూగజీవులకి ఆహారం పెట్టడం అనేది దైవ పూజతో సమానం. జంతువుల పట్ల ప్రేమ చూపించి వాటికి సేవ చేయడం వలన జాతకంలో దోషాలు తొలగిపోతాయి. అదృష్టం కూడా మన వెంట ఉంటుంది. ముఖ్యంగా బుధవారం నాడు ఈ పనులు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

బుధవారం బుధ గ్రహానికి చిహ్నం. మేధస్సు, వ్యాపారం, వాక్కు మొదలైన వాటికి కారకుడు బుధుడు. కాబట్టి బుధవారం నాడు ప్రత్యేక జంతువులకి పచ్చ గడ్డి లేదా పచ్చి కూరగాయలు వంటివి ఆహారంగా ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఇక ఏ జంతువులకు ఆహారాన్ని పెట్టడం వలన కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జంతువులకి ఆహారం పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది
1.గోమాత
గోమాతను మనం దైవంగా భావిస్తాము. ముక్కోటి దేవతలు గోమాతలో కొలువై ఉంటారని నమ్ముతాము. బుధవారం నాడు లేదా ప్రతిరోజు ఆవుకి పచ్చి గడ్డి లేదా తాజా కూరగాయలను ఆహారంగా పెట్టండి.
దీని వలన జాతకంలో ఉండే గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. భక్తితో గోసేవ చేస్తే సుఖశాంతులు కలుగుతాయి. ఆవుకి ఆహారాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.
2.మేకలకు ఆహారం పెట్టండి
మేకలకు ఆహారం పెట్టడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు లేదా బుధవారం, శుక్రవారం నాడు మేకలకు పచ్చి గడ్డి ఆహారంగా వేయండి. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే ప్రశాంతతను పొందవచ్చు. ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండడానికి కూడా వీలవుతుంది.
3.గజరాజుకి సేవ చేయండి
గజరాజుని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వరూపంగా భావిస్తాము. ఏనుగు తెలివితేటలు, బలం, సంపదకు చిహ్నం. ఏనుగుకి మేత వేయడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చటి మేత తినిపిస్తే వినాయకుని ఆశీస్సులు కలుగుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంచుకోవచ్చు.
4.గుర్రాలకు సేవ
{{/usCountry}}గజరాజుని సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వరూపంగా భావిస్తాము. ఏనుగు తెలివితేటలు, బలం, సంపదకు చిహ్నం. ఏనుగుకి మేత వేయడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చటి మేత తినిపిస్తే వినాయకుని ఆశీస్సులు కలుగుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంచుకోవచ్చు.
4.గుర్రాలకు సేవ
{{/usCountry}}గుర్రం పట్టుదల, వేగానికి నిదర్శనం. గుర్రాలు ఐశ్వర్యానికి సంకేతం. గుర్రాలకు ఆహారం పెట్టడం వలన వృత్తి, కెరీర్‌లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పనిలో వేగం పెరుగుతుంది. లక్ష్యాలను ఈజీగా చేరుకోవడానికి వీలవుతుంది.
5.కుందేలు
కుందేళ్లు చాలా చురుకైనవి. కుందేళ్లు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. కుందేళ్లకు ప్రతిరోజు కూరగాయలు తినిపిస్తే నెగటివ్ వైబ్రేషన్స్ తొలగి సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది.
ఇలా జంతువులకు ఆహారం పెట్టడం వలన ఈ విధంగా లాభాలను పొందవచ్చు. అలాగే మన మనసుకి కూడా ఎంతో తృప్తి కలుగుతుంది.