భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే మంచి కమ్యూనికేషన్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, నమ్మకం, అలాగే మధ్య మధ్యలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా అవసరమే. మన ప్రేమను కొన్నిసార్లు మాటలతో చెప్తే, మరి కొన్నిసార్లు బహుమతుల ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రేమిస్తున్నామనేది బహుమతుల ద్వారా చెప్పినప్పుడు వారు ఎంతో సంతో షపడతారు.

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, సంతోషం వెల్లివిరిసినప్పుడే ఆ సంసారం ఆనందంగా, స్వర్గంలా మారుతుంది. ఒక్కోసారి జాతకంలో గ్రహాల స్థితి అనుకూలంగా లేకపోయినట్లయితే దంపతుల మధ్య చిన్నచిన్న విభేదాలు, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నవగ్రహాల్లో ప్రేమ, లగ్జరీ, ఆకర్షణ, దాంపత్య సుఖానికి అధిపతి శుక్ర గ్రహం.
జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అలా ఉండాలంటే భర్త తన భార్యకు కొన్ని బహుమతులను ఇవ్వడం మంచిది. ఈ వస్తువులను భర్త బహుమతిగా ఇచ్చినట్లయితే శుక్ర గ్రహ అనుగ్రహం లభించి, సంబంధాలు బలపడతాయి. కనుక మల్లెపూలతో పాటు భార్యకు వీటిని బహుమతులుగా ఇవ్వడం మంచిది.
1.మల్లెపూలు
భార్యకు భర్త మల్లెపూలను బహుమతిగా ఇస్తే వారిద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది. ఆకర్షణ, ప్రేమ పెరగడానికి మల్లెపూలు అద్భుతంగా పని చేస్తాయి. మల్లెపూలు శుక్ర గ్రహానికి ఎంతో ప్రీతికరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. భర్త తన భార్యకు మల్లెపూలను ఇవ్వడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. బంధం ప్రశాంతంగా మారుతుంది. సంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం భార్యకు మల్లెపూలను భర్త ఇచ్చినట్లయితే జాతకంలో శుక్ర దోషాలు తొలగిపోతాయి.
2.గులాబీ రంగు దుస్తులు, వస్తువులు
భార్యకు భర్త గులాబీ రంగులో ఉండే వస్తువులు లేదా దుస్తులు వంటి వాటిని బహుమతిగా ఇవ్వడం వలన ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులను కూడా ఇవ్వచ్చు. వీటిని ఇవ్వడం వలన కుజుడు, శుక్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
3.వెండి ఆభరణాలు
{{/usCountry}}భార్యకు భర్త గులాబీ రంగులో ఉండే వస్తువులు లేదా దుస్తులు వంటి వాటిని బహుమతిగా ఇవ్వడం వలన ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులను కూడా ఇవ్వచ్చు. వీటిని ఇవ్వడం వలన కుజుడు, శుక్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
3.వెండి ఆభరణాలు
{{/usCountry}}వెండి, చంద్రుడితో ముడిపడి ఉంటుంది. వెండి మనసును ప్రశాంతంగా మారుస్తుంది. స్థిరత్వాన్ని అందిస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక సమస్య ఉన్నట్లయితే భర్త తన భార్యకు వెండి పట్టీలు, వెండి ఉంగరం వంటివి బహుమతిగా ఇవ్వడం మంచిదే.
4.పెర్ఫ్యూమ్స్
భర్త భార్యకు పెర్ఫ్యూమ్స్ ఇవ్వడం వలన శుక్రుడి స్థానం బలపడుతుంది. లక్ష్మీదేవి, శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. పెర్ఫ్యూమ్స్, రోజ్ వాటర్ వంటివి ఇవ్వచ్చు. చందనం, మల్లెపూల సువాసనలు ఉండే పెర్ఫ్యూమ్స్ ఇస్తే ఇంట్లో సానుకూల వాతావరణం కలుగుతుంది.
5.మేకప్ కిట్లు, అలంకరణ వస్తువులు
మేకప్ కిట్లు, అలంకరణ వస్తువులు కూడా భార్యకు బహుమతిగా ఇస్తే మంచిదే. వీటిని భర్త తన భార్యకు బహుమతిగా ఇవ్వడం వలన వారి మధ్య బంధం ఇంకా మెరుగుపడుతుంది. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.
6.ఆభరణాలు, ముత్యాల హారం
చంద్రుని అనుగ్రహం కలగాలంటే ముత్యాలను ధరించడం మంచిదే. చంద్రుడు మనసుకు కారకుడు. భర్త తన భార్యకు ముత్యాల హారం, ఆభరణాలు వంటివి బహుమతిగా ఇవ్వడం వలన వారు ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది.
వీటిని భర్త తన భార్యకు బహుమతిగా ఇవ్వడంతో పాటు, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించడం, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం, స్వేచ్ఛ ఇవ్వడం వంటివి చాలా ముఖ్యం. అలాగే క్షమించడం, కృతజ్ఞతలు చెప్పడం కూడా బంధాన్ని బలంగా మారుస్తాయి.