శనివారం ఈ చిన్న పని చేస్తే భర్త కోపం తగ్గి, మనసు కరిగిపోతుంది.. డబ్బు, భయాలు, కష్టాలు, భార్య సంతోషం కోసం కూడా పరిహారాలు!

ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుకుంటారు. భర్త సంపాదన రెట్టింపు కావాలన్నా, మనశ్శాంతి కలగాలన్నా స్త్రీలు పాటించాల్సిన అద్భుత ఆధ్యాత్మిక పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. డబ్బు, భయాలు, కష్టాలు, భార్య సంతోషం కోసం కూడా పరిహారాలు ఇవిగో.

Published on: May 22, 2026, 16:00:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది స్త్రీలు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. భర్త ఆదాయం పెరగక కొంత మంది స్త్రీలు ఇబ్బంది పడుతుంటే, అవమానాలు ఎదురై మరికొందరు, డబ్బు నిలవక మరి కొందరు, మనసు బాధగా కొందరికి ఉంటే, మరికొందరికి ఎక్కువ భయం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.

శనివారం ఈ చిన్న పని చేస్తే భర్త కోపం తగ్గి, మనసు కరిగిపోతుంది.. డబ్బు, భయాలు, కష్టాలు, భార్య సంతోషం కోసం కూడా పరిహారాలు! (pinterest)
శనివారం ఈ చిన్న పని చేస్తే భర్త కోపం తగ్గి, మనసు కరిగిపోతుంది.. డబ్బు, భయాలు, కష్టాలు, భార్య సంతోషం కోసం కూడా పరిహారాలు! (pinterest)

మరికొంత మంది ఇళ్లల్లో భార్యను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భార్యను సంతోషంగా ఉంచితే ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. అలాగే కొందరి ఇళ్లల్లో భర్త కోపం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ అద్భుత పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలతో పాటుగా శని దోషం కూడా తొలగిపోవడానికి ఈ మార్గాలను పాటించండి. ఇక మీ ఇంట సంతోషాలు వెల్లివిరుస్తాయి.

భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే స్త్రీలు ఏం చేయాలి?

భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే స్త్రీలు ఈ పరిహారాలను పాటించడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. భర్త ఆదాయం పెరిగి అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది.

భర్త సంపాదన పెరగాలంటే పెళ్లైన ప్రతి ఒక్క స్త్రీ కూడా తన పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి. భర్త సంపాదన పెరగడానికి ప్రతి స్త్రీ కూడా పంచమాంగల్యాలను ధరించాలి. అలాగే రోజూ ముఖానికి పసుపు రాసుకోవాలి.

భర్త సంపాదన పెరగడానికి, భర్త ఇంటి నుంచి వెళ్లిన వెంటనే బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం వంటివి చేయకూడదు.

భర్త పర్సులో ఐదు యాలకులను పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలకు సులువైన పరిష్కారాలు

మనసు బాధగా ఉందా?

మనసు బాధగా ఉంటే “శ్రీరామ జయరామ జయ జయ రామ” అని రోజు చదువుకోండి.

భయం ఎక్కువగా ఉందా?

రోజు భయపడుతున్నారా? భయం ఎక్కువగా ఉందా? అయితే “ఓం కాలభైరవాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.

అవమానాలు ఎదురవుతున్నాయా?

మీకు ఏదో ఒక అవమానాలు ఎదురవుతున్నాయా? అయితే “ఓం రాహవే నమః” మంత్రాన్ని జపించండి.

డబ్బు నిలవట్లేదా?

డబ్బు నిలవాలంటే “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని జపించండి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

మీరు చేసే పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా?

అయితే “ఓం హనుమతే నమః” అనే మంత్రాన్ని జపించండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

భార్యను సంతోషంగా ఉంచాలా? అయితే ఈ మార్గాలను ఫాలో అవ్వండి

భార్య సంతోషంగా ఉంటే ఆర్థిక వృద్ధి ఉంటుంది. భార్య సంతోషంగా ఉంటే ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్లందరూ కూడా ఆనందంగా ఉంటారు.

భార్యకు గౌరవం ఇవ్వండి: గృహలక్ష్మిగా గౌరవించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట నిలవదు. సంపద తరిగిపోతుంది.

పుట్టింటిని గౌరవించండి: ఆమె తల్లిదండ్రులను, ఆమె పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. దాని వలన సానుకూల శక్తి తగ్గిపోతుంది. కనుక వారికి గౌరవం ఇవ్వండి. సానుకూల శక్తిని పెంచుకోండి.

శుక్రుని అనుగ్రహం: శుక్రుని అనుగ్రహం ఉంటే సంతోషం, డబ్బు, విలాసాలకు లోటు ఉండదు. జ్యోతిష్యం ప్రకారం చూస్తే భార్య శుక్ర గ్రహానికి ప్రతీక. ఆమె సంతోషంగా ఉంటేనే కుటుంబ ఎదుగుదల కూడా ఉంటుంది.

నిర్ణయాల్లో భార్య సలహా తీసుకోండి: ఆర్థిక విషయాల్లో భార్య సలహా తీసుకోండి. అదృష్టం, విజయాలు కలుగుతాయి.

ఖర్చులకు స్వేచ్ఛ ఇవ్వండి: చిన్న చిన్న ఖర్చులకు ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే సంపద పెరుగుతుంది. మీరు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు.

మీ భర్త కోపాన్ని తగ్గించాలా? అయితే ఈ చిన్న పనులు చేయండి.. భర్త మనసు మైనంలా కరిగిపోతుంది..

శనివారం నాడు 21 లవంగాలను కుడి చేతిలో వేసుకుని, మీ భర్త పేరును 21 సార్లు తలుచుకుని ఆ లవంగాలను పూజ గదిలో పెట్టండి. ఆదివారం ఆ లవంగాలను కర్పూరంతో పాటు వెలిగించండి. దీని ద్వారా భర్త కోపం తగ్గుతుంది. ఇంట్లో సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. లేదంటే మంగళవారం భర్త పేరును ఎరుపు రంగు పెన్నుతో రాసి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టండి. ఆ హనుమాన్ అనుగ్రహంతో భర్త కోపం తగ్గుతుంది. ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More