19 ఏళ్ళ వరకు ఇలాంటి జ్యేష్ఠ మాసం రాదు.. మంగళవారాలు హనుమంతుడికి ఇలా పూజ చేయండి.. కష్టాలన్నీ మాయం!
ఈ మాసంలో వచ్చే 8 మంగళవారాల పాటు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అప్పుల బాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. 19 ఏళ్ళ వరకు ఇలాంటి జ్యేష్ఠ మాసం రాదు.
జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం చాలా అరుదైనది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహగతులతో ఉండే జ్యేష్ఠ మాసం రావడం విశేషమని చెప్పాలి. ఈ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా ముఖ్యమైనవి. ఈ మంగళవారాల్లో హనుమంతుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ మంగళవారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మరి ఈ మంగళవారాల్లో ఏం చేయాలి? మంచి ఫలితాలు కలగాలంటే వేటిని హనుమంతుడికి సమర్పించాలో తెలుసుకుందాం.

అద్భుతమైన జ్యేష్ఠ మాసం.. ఇలాంటి జ్యేష్ఠ మాసం 19 ఏళ్ల వరకు రాదు..మంగళవారాలు ఇలా చేస్తే మంచిది
ఈ మాసంలో ఎనిమిది మంగళవారాలు ఆంజనేయస్వామిని ఇలా ఆరాధించడం వలన శుభ ఫలితాలను చూడొచ్చు. ఇంట్లో ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయట పడడానికి కూడా వీలవుతుంది. మరి ఈ 8 మంగళవారాల్లో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? హనుమంతుడికి వేటిని సమర్పించాలో తెలుసుకుందాం.
మొదటి వారం
మొదటి వారం హనుమంతుడికి సంపంగి నూనెను సమర్పించండి. ఇలా చేయడం వలన అప్పులు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
రెండవ వారం
హనుమంతుడికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. రెండో వారం హనుమంతుడికి తమలపాకులను సమర్పించండి. ఇలా చేయడం వలన నరదృష్టి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆనందంగా ఉండొచ్చు.
మూడో వారం
మూడో వారం హనుమంతుడికి బెల్లం, ఎర్రటి వస్త్రాలను సమర్పించండి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి.
నాలుగవ వారం
నాలుగో వారం హనుమంతుడికి ఎర్ర గులాబీలు, తమలపాకులను సమర్పించండి. వీటిని సమర్పించడం వలన ఇబ్బందుల నుంచి బయటపడి సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఐదవ వారం
ఐదవ వారం హనుమంతుడికి అరటి పండ్లను సమర్పించండి. ఇలా చేయడం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు. చాలామంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటి వారు ఈ మంగళవారాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం వలన సంతోషం పెరుగుతుంది. ఆనందంగా ఉండొచ్చు.
ఆరవ వారం
ఆరవ వారం కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి హనుమంతుడికి సమర్పించండి. ఇలా చేయడం వలన అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ ఇబ్బంది ఉండదు. ఆటంకాలు వంటివి కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు.
ఏడవ వారం
ఏడవ వారం హనుమంతుడికి ఎర్ర కందిపప్పును సమర్పించండి. అలాగే దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. హనుమంతుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
ఎనిమిదవ వారం
ఎనిమిదవ వారం హనుమంతుడికి బూందీ లడ్డూను సమర్పించండి. ఇలా హనుమంతుడికి వీటిని సమర్పిస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఎప్పటినుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచిది.
ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలతో హనుమంతుడి అనుగ్రహాన్ని పొంది ఇబ్బందుల నుంచి బయటపడండి. జీవితంలో కష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ నెల ఒక సువర్ణ అవకాశమని గుర్తుపెట్టుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


