ఈరోజు గురు పుష్యమి యోగం.. ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొన్నా ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది!

గురు పుష్యమి యోగం: ఈరోజు చాలా శక్తివంతమైన గురు పుష్యమి యోగం. ఈరోజు ఈ పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.

Published on: May 21, 2026, 08:48:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. గురువారం, పైగా పుష్యమి నక్షత్రం, పంచమి తిధి ఉంది. ఇది చాలా అరుదైన పవిత్ర కలయిక అని చెప్పవచ్చు. గురు పుష్యమి యోగం చాలా పవిత్రమైనది. ఎప్పుడైనా సరే గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చినట్లయితే దానిని గురు పుష్యమి యోగం అని అంటారు.

ఈరోజు గురు పుష్యమి యోగం.. ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొన్నా ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది (pinterest)
ఈరోజు గురు పుష్యమి యోగం.. ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొన్నా ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది (pinterest)

ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయి. ఈ యోగంలో చేసే శుభకార్యాలకు ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఇది చాలా శుభదినం. బంగారం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా గురు పుష్యమి చాలా శుభప్రదమైన రోజు.

యాలకుల పరిహారాలు

లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకులను పెట్టి పూజ చేసి, పూజ అయిన తర్వాత డబ్బు దాచుకునే చోట పెట్టండి. ఖర్చులు తగ్గి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి.

మహాలక్ష్మీ దేవి అనుగ్రహం

ఈరోజు ఇంట్లో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

ఈరోజు దీపారాధన చేసి మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన దరిద్రం తొలగిపోయి శుభ ఫలితాలను పొందవచ్చు.

అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పుష్పాలను ఈరోజు సమర్పించండి. అష్టైశ్వర్యాలు, ధన లాభం కలుగుతాయి.

ఈ మంత్రాలను జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ఈ గురు పుష్యమి యోగ వేళ “ఓం నమో నారాయణాయ” లేదా “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాలను జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. మళ్లీ మళ్లీ ఇలాంటి అద్భుతమైన రోజు రాదు. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకుని మహాలక్ష్మీ దేవిని భక్తితో ఆరాధించండి.

గురు పుష్యమి వేళ ఈ పసుపు పరిహారం పాటించండి

గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఒక చిన్న ఐదు రూపాయల పసుపు కొన్నా ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ఆ పసుపును తీసుకువచ్చి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఎంతో సంపద కలుగుతుంది.

దానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి

లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి నెల మీకు వచ్చే కొంత డబ్బులు దేవుని పేరు మీద ఏదో ఒక ఆలయానికి వెళ్లి విరాళం ఇవ్వండి. దాంతో భగవంతుడు దయ మీపై ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్న కొంత డబ్బును సామాజిక సేవ కోసం ఖర్చు చేయండి. ఈ విధంగా పాటిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More