పెళ్ళి అవ్వట్లేదా, గ్రహ దోషాలా, ఆర్థిక, సంతాన సమస్యలా? జాతకం లేదని చింతించకండి.. ఈ పరిహారాలతో అన్నీ పటాపంచల్!

చాలామందికి తమ పుట్టిన సమయం, జాతక చక్రం తెలియదు. అలాంటి వారు ఎదుర్కొనే ఆర్థిక, ఆరోగ్య, వివాహ సమస్యల పరిష్కారానికి పండితులు సూచిస్తున్న అద్భుతమైన శాంతులు, పూజల వివరాలు ఇక్కడ చదవండి.

Published on: May 18, 2026, 12:15:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మ శాస్త్రాల్లో జాతకానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. గ్రహాల స్థితిగతులను చూసి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను మనం ముందే గుర్తించచ్చు. అలాగే వాటికి తగిన శాంతులు కూడా చేయించుకోవచ్చు. అయితే అందరికీ జాతక చక్రం అందుబాటులో ఉండకపోవచ్చు. పుట్టిన సమయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.

పెళ్ళి అవ్వట్లేదా, గ్రహ దోషాలా, ఆర్థిక, సంతాన సమస్యలా? జాతకం లేదని చింతించకండి.. ఈ పరిహారాలతో అన్నీ పటాపంచల్! (pinterest)
పెళ్ళి అవ్వట్లేదా, గ్రహ దోషాలా, ఆర్థిక, సంతాన సమస్యలా? జాతకం లేదని చింతించకండి.. ఈ పరిహారాలతో అన్నీ పటాపంచల్! (pinterest)

జాతక పత్రం లేకపోయినా, పుట్టిన సమయం సరిగ్గా తెలియకపోయినా సమస్యలను పరిష్కరించుకోవడం సులభమే. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. పురాణాలు, జ్యోతిష్య నిపుణులు అలాంటి వారి కోసం కూడా కొన్ని అద్భుతమైన పరిహారాలు సూచించారు. వీటిని పూర్తి విశ్వాసంతో పాటించినట్లయితే భగవంతుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మరి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ సమస్య ఏదైనా పరిష్కారం ఇదిగో.. జాతకం లేకపోయినా పరవాలేదు

1.ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

ఆరోగ్యం బాగుండడానికి, మానసిక ప్రశాంతత కలగడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు ఉంటే ఏమైనా చేయొచ్చు. జాతకంతో సంబంధం లేదు. ప్రతిరోజూ ఉదయం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది.

పనుల్లో విజయాన్ని కూడా పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మనసులో భయాలు ఉన్నట్లయితే 108 సార్లు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. దీంతో అకాల మృత్యు భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఆనందంగా ఉండొచ్చు.

2.ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడాలనుకుంటున్నట్లయితే మీ జాతకంతో సంబంధం లేదు. 41 రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచి ఫలితాలను చూడొచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడడానికి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 41 రోజులు జపిస్తూ నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది. రోజూ శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం వలన ధన వృద్ధి కలుగుతుంది. మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలను చూడొచ్చు.

3.గ్రహ దోషాల నుంచి బయట పడడానికి ఈ చిన్న పరిహారాలను పాటించండి

గ్రహ ప్రభావం వలన కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయని చాలామంది భయపడతారు. ఆ భయం కూడా మీలో ఉంటే ఈ శాంతులను పాటిస్తే మంచిది.

  • చంద్ర శాంతి

మనశ్శాంతి పొందడానికి సోమవారం నాడు శివాభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలను చూడచ్చు.

  • రాహువు, కేతువు దోషాలు

రాహు శాంతి కోసం దుర్గాదేవిని ఆరాధించండి. లలితా సహస్రనామ పారాయణం చేయండి.

కేతు శాంతి కోసం గణపతి పూజ లేదా వినాయక వ్రతం చేయడం వలన విశేషమైన ఫలితాలను చూడవచ్చు. అద్భుతమైన మార్పులు వస్తాయి.

  • శని దోషం

శని దోషం నుంచి బయట పడడానికి హనుమంతుని ఆలయంలో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాను చదువుకోండి.

4.విజయాలు కలగడానికి

పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి, విజయాలను పొందడానికి గణపతి అధర్వశీర్షం పారాయణం చేస్తే చక్కటి ఫలితాలను చూడొచ్చు. అద్భుతమైన మార్పులు వస్తాయి.

5.వివాహం, సంతాన సమస్యలు

సకాలంలో పెళ్లి అవ్వాలన్నా, సంతాన సమస్యలతో సతమతమవుతున్నా ఈ ప్రత్యేక పూజలు అద్భుతంగా పని చేస్తాయి. వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే రుక్మిణి కళ్యాణాన్ని పారాయణం చేయండి. లేకపోతే 41 రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే కూడా మంచి సంబంధం వస్తుంది.

సంతాన సమస్యలు ఉన్నట్లయితే కాళహస్తిలో సర్పదోష నివారణ పూజ చేయించండి. లేదా సంతాన గోపాలకృష్ణ వ్రతం చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఆనందంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు.

అయితే ఏ పూజ చేసినా, ఏ మంత్రాన్ని పఠించినా భక్తి, ఏకాగ్రత చాలా అవసరం. జాతకం లేదని చింతించకండి. ఈ పరిహారాలను శ్రద్ధతో పాటించండి. కచ్చితంగా మార్పు కనబడుతుంది. నమ్మకమే విజయానికి పునాది అని గుర్తుపెట్టుకుని ఆచరించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More