Blue Moon Remedies : బ్లూ మూన్ ఏ సమయంలో కనిపిస్తుంది? పాటించాల్సిన 7 పరిహారాలు!
Blue Moon Remedies : మే 31, 2026న బ్లూమూన్ భారతదేశంలో ఏ సమయంలో కనిపిస్తుంది? అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
Blue Moon Timings May 2026 : ఈసారి మే 31 పౌర్ణమి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ రోజున మీరు ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు. జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం రెండింటి దృక్కోణాల నుండి ఇది ఒక అరుదైన, ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు, రెండో దానిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈసారి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, అందుకే దీనికి స్కార్పియో బ్లూ మూన్ అని పేరు వచ్చింది. మత విశ్వాసం ప్రకారం, ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజించడం చాలా ఫలప్రదం. భారతదేశంలో ఈ బ్లూ మూన్ ఏ సమయంలో కనిపిస్తుందో, ఈ సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటో చూడండి.

ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వచ్చినప్పుడు, రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. మే 2026లో మొదటి పౌర్ణమి నెల ప్రారంభంలో రాగా.. రెండో పౌర్ణమి మే 31న వస్తుంది. ఈ కారణంగానే దీనిని బ్లూ మూన్ అని పిలుస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు.
మే 31న కనిపించే బ్లూ మూన్ రంగు సాధారణ పౌర్ణమి మాదిరిగానే ఉంటుంది. దీనికి రంగు కారణంగా పేరు పెట్టలేదు. కానీ ఖగోళ గణనల కారణంగా పేరు ఇలా పెట్టారు. భారతదేశంలో బ్లూ మూన్ మీరు ఎలా? ఏ సమయంలో చూడగలరు? భారతదేశంలో, మే 31 సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత బ్లూమూన్ కనిపిస్తుంది. దీనిని చూడటానికి ఉత్తమ సమయం సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్య ఉంటుంది. ఈ సమయంలో ఇది ఆకాశంలో సులభంగా కనిపిస్తుంది. వాతావరణం క్లియర్ గా ఉంటే ఎలాంటి బైనాక్యులర్స్ లేకుండా చూడొచ్చు.
బ్లూ మూన్ పరిహారాలు
మే 32 రోజున ఈ సులభమైన కొన్ని పరిహారాలు పాటించాలి.
1. మే 31 న చంద్రుడిని చూసి నీటిని సమర్పించండి.
2. చంద్రుణ్ణి చూసిన తర్వాత ఓం సోమయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
3. తెల్ల స్వీట్లు, బియ్యం లేదా పాలు దానం చేయడం శుభప్రదం.
4. మీ మనశ్శాంతి కోసం, మీరు కొంత సమయం ధ్యానంలో గడపాలి.
5. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం వెన్నెల రాత్రిలో కాసేపు కూర్చోండి.
6. లక్ష్మీదేవిని పూజించి పాయసం సమర్పించండి.
7. కుటుంబ శ్రేయస్సు కోసం రాత్రి 1 దీపం వెలిగించాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


