Lucky Rasis: రేపే ఆకాశంలో అద్భుతం.. స్కార్పియో బ్లూ మూన్.. ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం!

Lucky Rasis: మే 31న ఆకాశంలో అరుదైన స్కార్పియో బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ మార్పు వల్ల మేషం, సింహం, మకర రాశుల జాతకులకు విపరీతమైన ధనలాభం, కెరీర్‌లో పురోగతి కనిపిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.

Published on: May 30, 2026, 09:31:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యేష్ట మాసంలో వచ్చే ఈ పున్నమి తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అధిక మాస పూర్ణిమ కలయిక రెండు రోజుల పాటు ఉండటం విశేషం. హిందూ పంచాంగం ప్రకారం.. జ్యేష్ట మాస శుక్ల పక్ష పూర్ణిమ తిథి మే 30వ తేదీ ఉదయం 11:58 గంటలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 02:14 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది జ్యేష్ట పూర్ణిమ వేళ ఒక అరుదైన ఖగోళ సంఘటన చోటుచేసుకోబోతోంది. మే 31వ తేదీన ఆకాశంలో 'బ్లూ మూన్' అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సమయంలో ఈ పూర్ణిమ రావడం వల్ల దీనిని 'స్కార్పియో బ్లూ మూన్' అని పిలుస్తున్నారు.

Lucky Rasis: రేపే ఆకాశంలో అద్భుతం.. స్కార్పియో బ్లూ మూన్.. ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం!
Lucky Rasis: రేపే ఆకాశంలో అద్భుతం.. స్కార్పియో బ్లూ మూన్.. ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం!

జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ప్రకారం.. ఈ స్కార్పియో బ్లూ మూన్ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఆ రాశుల జాతకాల్లో వెలుగులు నిండనున్నాయని పండితులు చెబుతున్నారు.

బ్లూ మూన్ వేళ ఈ రాశులకు బోలెడు లాభాలు

1.మేష రాశి

మేష రాశి జాతకులకు ఈ బ్లూ మూన్ కాలం ఒక వరంలా మారనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు లేదా ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి లేదా గుర్తింపు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను గడిస్తారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా నిలకడను ఇస్తుంది.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ ఖగోళ మార్పు సానుకూల ఫలితాలను మోసుకొస్తుంది. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఒక పెద్ద డీల్ అకస్మాత్తుగా ఓకే అయ్యే అవకాశం ఉంది. జీవితంలోని ప్రతి అడుగులోనూ ఒక కొత్త ఉత్సాహం, సానుకూలత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనికి పైఅధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

3.మకర రాశి

మకర రాశి జాతకులకు బ్లూ మూన్ అదృష్టాన్ని మోసుకొస్తుంది. ముఖ్యంగా కళాకారులు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం ఎంతో కీలకం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఏవైనా మనస్పర్థలు ఉంటే అవి తొలగిపోయి, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది.

బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడా?

చాలామందిలో ఉండే సందేహం ఇది. సైన్స్ పరంగా చూస్తే.. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే, రెండో పౌర్ణమి నాటి చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. దీనికి రంగుతో ఎటువంటి సంబంధం లేదు. మే 31న ఆకాశంలో చంద్రుడు మామూలు రోజుల్లో లాగే తెల్లగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడి పరిమాణంలో గానీ, రంగులో గానీ ఎటువంటి మార్పు ఉండదు. ఇది కేవలం ఒక జ్యోతిష్య, ఖగోళ పరిభాష మాత్రమే.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మతపరమైన విశ్వాసాలు, జ్యోతిష్య పండితుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చిందే. దీనిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More