...
...
Next Story

ఆగస్టు 12న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. మీ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

2026 ఆగస్టు 12న ఏర్పడనున్న ఈ ఏడాది రెండవ, చివరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడంతో సూతక కాలం వర్తించదు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ప్రభావం మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశుల వారిపైనా ఉంటుందని భావిస్తారు.

Published on: Aug 7, 2026, 14:00:21 IST
Advertisement

ఈ ఏడాదిలో వచ్చే రెండవ, చివరి సూర్యగ్రహణం ఆగస్టు నెలలోనే రాబోతోంది. ఆగస్టు 12న ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం వర్తించదు. గ్రహణం కనిపించకపోయినా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి

ఆగస్టు 12న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. మీ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?
ఆగస్టు 12న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. మీ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

మేష రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ఎప్పటినుంచో పూర్తికాని సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. రోజూ హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహణం కారణంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. శివుడికి తెలుపు రంగు పూలను సమర్పించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.

మిథున రాశి

మిథున రాశి వారికి గ్రహణం వలన ఆర్థికంగా బాగుంటుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకుపచ్చని కూరగాయలను దానం చేయడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పని ప్రదేశంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విశేష ఫలితాలను చూడొచ్చు.

సింహ రాశి

సింహ రాశి వారికి కాస్త ఛాలెంజింగ్‌గా ఉంటుంది. గొడవలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సూర్య అష్టకం చదువుకుంటే మంచిది.

కన్యా రాశి

తులా రాశి వారు ఎప్పటినుంచో పూర్తికాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. నెయ్యి దీపం వెలిగిస్తే ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలతో సంతోషంగా ఉంటారు. శివుడికి తేనె నివేదించడం మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సూర్యగ్రహణం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైన ఇన్వెస్ట్‌మెంట్లు చేసేటప్పుడు ఆలోచించి చేయడం మంచిది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. పసుపు రంగులో ఉండే స్వీట్లను దానం చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి సూర్యగ్రహణం వలన కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు. తప్పు నిర్ణయాలు తీసుకోవడం వలన సమస్యలు ఎక్కువవుతాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా కలిసి రాకపోవచ్చు. అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శివుడికి తేనె నివేదించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుంకుమపువ్వు దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe