హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం పవిత్రతకు పెద్దపీట వేస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శివాలయాలు శివనామస్మరణతో మార్మోగే ఈ రోజునే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను కూడా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ రోజున ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.

సరిగ్గా ఇదే రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుండటంతో దేశవ్యాప్తంగా భక్తుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా గ్రహణ సమయాల్లో శుభకార్యాలు, పూజలు నిషిద్ధం కాబట్టి, ఈ పండుగపై దాని ప్రభావం ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపుతున్నారు.
18 ఏళ్ల తర్వాత అరుదైన యోగం
ఖగోళ గణాంకాల ప్రకారం, శ్రావణ మాసంలో ఇలా చంద్రగ్రహణం ఏర్పడటం దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2008లో సావన్ మాస అమావాస్య, పౌర్ణమి సమయాల్లో ఇలాంటి గ్రహణాల యోగం కనిపించింది. ఈసారి ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ ఏడాదికి చివరిది కావడం గమనార్హం. ఇది పాక్షిక చంద్రగ్రహణంగా ఖగోళ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తేదీలపై స్పష్టత.. పండుగ ఎప్పుడంటే?
హిందూ పంచాంగం ప్రకారం, పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 09:09 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 09:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఆగస్టు 28వ తేదీనే శ్రావణ పూర్ణిమ వేడుకలు, రాఖీ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర రోజున నదీ స్నానాలు, దానధర్మాలు, ప్రత్యేక పూజలకు విశేషమైన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈసారిక రాఖీ పండుగకు ఎలాంటి భద్రతో పాటు అశుభ సమయాల అడ్డంకులు కూడా లేవు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోవడంతో రోజంతా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు అనుకూలమైన సమయం కుదిరింది.
భారత్‌లో గ్రహణం ప్రభావం శూన్యం
చంద్ర గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, భారత్‌లో ఉన్నవాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28న ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగిసే ఈ గ్రహణం పగటిపూట రావడం, ఆ సమయంలో మన వైపు చంద్రుడు క్షితిజానికి దిగువన ఉండటం వల్ల ఇది గోచరించదు.
{{/usCountry}}చంద్ర గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, భారత్‌లో ఉన్నవాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 28న ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగిసే ఈ గ్రహణం పగటిపూట రావడం, ఆ సమయంలో మన వైపు చంద్రుడు క్షితిజానికి దిగువన ఉండటం వల్ల ఇది గోచరించదు.
{{/usCountry}}అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. మన దేశంలో గ్రహణ దృశ్యమానత లేకపోవడం వల్ల సూతక సూత్రాలు, నిబంధనలు ఇక్కడ వర్తించవు. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా యథావిధిగా స్నానాలు, దానాలు, రాఖీ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు.