...
...
Next Story

ఆగస్టు 5న బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి!

ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, ఇప్పటికే అక్కడ ఉన్న సూర్యుడితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ, ముఖ్యంగా మేష, మిథున, కర్కాటక, తులా రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.

Published on: Aug 4, 2026, 11:00:31 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహ సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కలిగితే, మరోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 5న బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి! (pinterest)
ఆగస్టు 5న బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి! (pinterest)

ఆగస్టు 5న బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది. జన్మకుండలిలో సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో లేదా ఒకే భావంలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఆగస్టు 5న, అంటే రేపు, ఈ ప్రత్యేకమైన యోగం ఏర్పడనుంది.

ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో, ఇప్పటికే కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న సూర్యుడితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకు రానుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశులకు ఊహించని లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం చతుర్థ భావంలో ఏర్పడుతుంది. ఇది ఆస్తులు, కుటుంబ జీవితానికి సంబంధించిన భావం. ఇల్లు, భూమి వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఆగస్టు నెలలో కొంత మందికి వాహన యోగం కలిగే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది.

2.మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి ఈ యోగం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు కుదిరి భారీ లాభాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కూడా ఉంటాయి. వాక్చాతుర్యం, తార్కికత వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.

3.కర్కాటక రాశి

తులా రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగం, వృత్తి, కెరీర్‌లో మంచి ఫలితాలను చూస్తారు. పనిపట్ల చురుకుదనం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. ఉద్యోగం మార్చాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe