...
...
Next Story

జులై నెలలోని శుభ ముహూర్తాల రోజులు.. ఆషాఢ మాసం ప్రారంభం ఎప్పుడు?

జులై నెలలో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అంతకుముందు కొన్ని శుభ ముహూర్తాలు వచ్చే రోజులు ఉన్నాయి. గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు ఉంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు.

Published on: Jul 4, 2026, 15:46:47 IST
Advertisement

హిందూ సంప్రదాయంలో ప్రతి నెలా ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు నిర్వహించకపోయినా.. దైవారాధనకు పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆకాశంలో జరిగే అద్భుత ఖగోళ మార్పులకు, ఆధ్యాత్మిక సాధనలకు ఈ మాసం వేదికగా నిలుస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది. జులై నెలలో గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, కొత్త పనులు మెుదలుపెట్టేందుకు జులై 1, 2, 3, 4, 5, 6 తేదీలు అత్యంత అనుకూలమైన రోజులు.

జులైలో మంచి రోజులు
జులైలో మంచి రోజులు

ఖగోళ శాస్త్రం ప్రకారం జూలై నెలలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. జూలై 17వ తేదీ ఉదయం 11:04 గంటలకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ‘కర్కాటక సంక్రమణం’ లేదా దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఇప్పటివరకు ఉత్తరం వైపు ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిశగా తన ప్రయాణాన్ని మెుదలుపెడతాడు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే.. దక్షిణాయనం రాత్రి కాలంతో సమానంగా భావిస్తారు. ఈ ఆరు నెలల కాలంలో పితృదేవతల ఆరాధన, దానధర్మాలు, వ్రతాలు చేయడం వల్ల అమితమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

ఈ నెల జులై 29న అత్యంత పవిత్రమైన వ్యాస పూర్ణిమ(గురు పూర్ణిమ) రానుంది. ఈ ఏడాది గురుపూర్ణిమ నాడు గురు గ్రహం ఉచ్ఛ రాశిలో ఉండటం విశేషం. రవి, గురు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ పుణ్యకాలంలో ధ్యానం, జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

జూలై 3 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురుస్తాయి. సంకట హర చతుర్థి కూడా ఇదే రోజు. గణపతి ఆరాధన చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks