Baby Names : పిల్లలకు ఎప్పుడూ ఇలాంటి పేర్లు పెట్టకూడదు.. ట్రెండీగా ఉన్నాయనుకోవద్దు!

Baby Names : పిల్లలకు పేర్లు పెట్టడం అనేది కేవలం వేడుక మాత్రమే కాదు.. అది బాధ్యత కూడా. కొందరు కేవలం ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉన్నాయని అర్థం లేని పేర్లు పెడుతుంటారు. అయితే అలాంటి పేర్లు పెట్టకూడదు.

Published on: Apr 26, 2026, 12:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో నామకరణం, లేదా పిల్లలకు పేరు పెట్టే ఆచారం చాలా ముఖ్యం. ఒక పేరు పిల్లల వైబ్రేషన్, భవిష్యత్తు, జాతకాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, రాశి, సంస్కృత అర్థంతో సరిపోలని పేర్లు అశుభకరమైనవిగా అంటుంటారు.

పిల్లలకు పెట్టకూడని పేర్లు
పిల్లలకు పెట్టకూడని పేర్లు

పిల్లలకు ప్రతికూల అర్థాలు లేదా విచారకరమైన అశుభ సూచనలు ఉన్న పేర్లు పెట్టకూడదు. పేరు పెట్టేటప్పుడు దాని మూలాన్ని చూసుకోవాలి. పేరు అర్థం ప్రతికూలంగా ఉంటే, అది పిల్లల జీవితంలో ఆందోళన, భయం లేదా ఉదాసీనతకు కారణమవుతుందని నమ్ముతారు. ట్రెండీగా కనిపించినా.. ప్రతికూల అర్థాలు ఉన్న ఆధునిక పేర్లను పెట్టకూడదు.

యాచ్నా దీని అర్థం భిక్షాటన చేయడం. శ్లేష్మ అంటే శ్లేష్మం లేదా కఫం(వ్యాధికి సంబంధించినది), చింత అంటే ఆందోళన లేదా చింత. ఇది ప్రతికూలమైనది. ఈ పేర్ల పెట్టకూడదు. ఆరవ్ అనే పేరను సాధారణంగా దీనిని శాంతిగా అర్థం చేసుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఇది అరుపు లేదా ప్రతికూల శబ్దంగా ఉండవచ్చు.

ఉదాహరణకు అవీర్ అనే పేరుకు పిరికివాడు లేదా ధైర్యం లేనివాడు అని అర్థం. కానీ దీనిని తరచుగా ధైర్యవంతుడు లేదా శౌర్యం అని తప్పుగా అర్థం చేసుకుంటారు, అయితే సంస్కృతంలో దీనికి వ్యతిరేక అర్థం ఉంది. ఈ పేరును అలా ఉంచుకోకూడదు.

ఏ భాషలోనైనా సహస్రనామంలో అర్థాన్ని చూసుకోండి. విచారం, భయం లేదా ఉదాసీనతను సూచించే ఏ పేరునూ మీ పిల్లలకు పెట్టవద్దు. పిల్లలకు పురాణాలు లేదా చరిత్రలోని ప్రతికూల పాత్రల పేర్లను గానీ, రాక్షసుల పేర్లను గానీ పెట్టకూడదు. రాక్షసుల, దుష్ట పాత్రల, లేదా విషాద పాత్రల పేర్లు దుష్టశక్తులను ఆకర్షిస్తాయని నమ్ముతారు.

రావణుడు, కంసుడు, దుర్యోధనుడు / దుశ్శాసనుడిపై వచ్చే పేర్లను పెట్టొద్దు. మృత్యు, యముడిపై వచ్చే పేర్లకు కూడా దూరంగా ఉండాలి.

పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం మంచిది. కానీ ఋషుల పేర్లను నేరుగా పెట్టకూడదని అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రం, జాతకం ఆధారంగా నిషిద్ధ అక్షరాలు ఉంటాయి. నిషిద్ధ శబ్దాలను పేర్లుగా పెట్టకూడదు. శబ్దాలు జాతకంలోని 6వ, 8వ లేదా 12వ భావాన్ని ప్రేరేపించి అశుభాన్ని కలిగించవచ్చు. నక్షత్ర పాదానికి సరిపోని అక్షరాలను పెట్టకూడదు.

సాధారణంగా జ్యోతిష్యులు నక్షత్రం పేరును దాని అసలు అక్షరాలతో చెప్పరు.. ఎందుకంటే అలా చేయడం చేతబడికి ఆస్కారం కల్పిస్తుందని నమ్ముతారు. దానికి బదులుగా దానికి దగ్గరలో ఉన్న ఒక శుభప్రదమైన అక్షరాన్ని ఉపయోగిస్తారు. పేరు పెట్టే ముందు జ్యోతిష్యునితో జాతకాన్ని చూపించి.. శుభ సమయంలో బిడ్డకు నామకరణం చేయండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More