...
...
Next Story

బతుకమ్మ పండుగ 2026: అంగరంగ వైభవంగా ప్రారంభం.. 9 రోజుల పూల వేడుకల విశేషాలు.. ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ 2026 అక్టోబర్ 10న ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సంప్రదాయ పాటలు పాడుతూ, ఆడిపాడుతూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

Published on: Oct 10, 2026, 11:50:33 IST
Advertisement

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ అక్టోబర్ 10, అంటే ఈరోజు నుంచి ప్రారంభమైంది. ప్రకృతిని, పూలను, స్త్రీశక్తిని ఆరాధిస్తూ మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చుతారు. సంప్రదాయ పాటలు పాడుతూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం జరుగుతుంది.

బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత

బతుకమ్మ పండుగ 2026: అంగరంగ వైభవంగా ప్రారంభం.. 9 రోజుల పూల వేడుకల విశేషాలు.. ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? (AI)
బతుకమ్మ పండుగ 2026: అంగరంగ వైభవంగా ప్రారంభం.. 9 రోజుల పూల వేడుకల విశేషాలు.. ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? (AI)

ప్రకృతి ఆరాధన: గునుగు, తంగేడు, బంతి, చామంతి లాంటి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

గౌరీదేవి ఆరాధన: అమ్మవారిని పూలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం జరుగుతుంది.

ఈ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక గుర్తింపుకు ప్రత్యేకంగా నిలుస్తుంది.

బతుకమ్మ పండుగ 2026

తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల బతుకమ్మలను తయారు చేసి అమ్మవారిని ఆరాధిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఏం చేయాలి?

పూలతో బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుందని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కూడా గౌరీదేవిని ఆరాధించడం జరుగుతుంది. అలాగే, చివరి రోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మను ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులు, నీటి వనరుల వద్ద నిమజ్జనం చేస్తారు.

అక్టోబర్ 10, అమావాస్య – ఎంగిలిపూల బతుకమ్మ: ఈరోజు నువ్వులను పొడి చేసి, పంచదార వేసి నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 11, ఆదివారం – అటుకుల బతుకమ్మ: అటుకులతో నైవేద్యాన్ని సమర్పించాలి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా వేస్తారు.

అక్టోబర్ 12, సోమవారం – ముద్దపప్పు బతుకమ్మ: కందిపప్పు ఉడికించి, జీలకర్ర, కరివేపాకు, నూనె, పసుపు వేసి, సరిపడా ఉప్పు కూడా వేసి నైవేద్యంగా పెడతారు.

అక్టోబర్ 13, మంగళవారం – నానబియ్యం బతుకమ్మ: బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టాలి.

అక్టోబర్ 14, బుధవారం – అట్ల బతుకమ్మ: ఆరోజు అట్లను నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 15, గురువారం – అలిగిన బతుకమ్మ: ఈరోజు నైవేద్యాన్ని సమర్పించకూడదు.

అక్టోబర్ 16, శుక్రవారం – వేపకాయల బతుకమ్మ: సకినాల పిండితో వేపకాయలు చేసి నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 17, శనివారం – వెన్నముద్దల బతుకమ్మ: బియ్యప్పిండిని ఉడికించి ఉండలుగా చేసి, వాటిని నూనెలో వేయించి, బెల్లం పాకం పట్టాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks