చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

వాస్తు ప్రకారం, చైనీస్ ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో శక్తికి, మన దైనందిన జీవన విధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మనం నిద్రించే స్థానం, నిద్రించే దిశ మానసిక ప్రశాంతత, సానుకూల శక్తిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో మంచాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
తలుపుకు ఎదురుగా మంచం ఉంచి నిద్రించడం మంచిది కాదు. ఇలా చేస్తే శక్తి నేరుగా బయటకు వెళ్లిపోతుంది. పురాతన కాలంలో మృతదేహాన్ని తలుపుకి ఎదురుగా ఉంచేవారు. అందుకని దీనిని అశుభంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
నిద్రించే దిశ
వాస్తు ప్రకారం నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నిద్రపోయేటప్పుడు సరైన దిశలోనే నిద్రపోవాలి. లేకపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. తలను తప్పు దిశలో పెట్టి నిద్రపోవడం వలన మానసిక ఆందోళన, నిద్రలో ఆటంకాలు, ప్రతికూల భావాలు కలుగుతాయి. కాబట్టి బెడ్‌రూమ్‌లో నిద్రపోయేటప్పుడు మంచాన్ని సరైన దిశలో ఉంచాలి. తలను కూడా సరైన దిశలో ఉంచాలి.
సాయంత్రం వేళ నిద్రపోకూడదు
చాలామంది సాయంత్రం వేళల్లో నిద్రపోతారు. కానీ ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేయడం వలన ఇంట్లో ధనం, ఆహారానికి కొరత ఏర్పడుతుంది. సమయానికి నిద్రపోవాలి, ఉదయాన్నే మేల్కొనాలి. అదే మంచి అలవాటు. దాని వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ప్రతి వ్యక్తి నిద్ర అవసరాలు వారి వయసు, ఆరోగ్యం, పని విధానాన్ని బట్టి మారుతాయి.
సానుకూల వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
బెడ్రూమ్ను శుభ్రంగా ఉంచాలి. క్రమబద్ధంగా, ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచం చుట్టూ తగినంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. గదిలో సులువుగా కదలడానికి వీలుగా ఉండేటట్టు బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వాస్తు సూత్రాలను పాటిస్తే భద్రత, సౌకర్యం, మంచి నిద్ర కలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం ఉండవు.
{{/usCountry}}బెడ్రూమ్ను శుభ్రంగా ఉంచాలి. క్రమబద్ధంగా, ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచం చుట్టూ తగినంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. గదిలో సులువుగా కదలడానికి వీలుగా ఉండేటట్టు బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వాస్తు సూత్రాలను పాటిస్తే భద్రత, సౌకర్యం, మంచి నిద్ర కలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం ఉండవు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.