బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేస్తే ప్రశాంతత, మంచి నిద్ర లభిస్తాయి!
వాస్తుశాస్త్రం, చైనీస్ ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లోని శక్తికి, ముఖ్యంగా బెడ్‌రూమ్ అమరికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. మంచాన్ని తలుపుకు నేరుగా ఎదురుగా ఉంచకూడదని, నిద్రించే సమయంలో సరైన దిశను ఎంచుకోవాలని సూచిస్తారు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

వాస్తు ప్రకారం, చైనీస్ ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో శక్తికి, మన దైనందిన జీవన విధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మనం నిద్రించే స్థానం, నిద్రించే దిశ మానసిక ప్రశాంతత, సానుకూల శక్తిపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో మంచాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
తలుపుకు ఎదురుగా మంచం ఉంచి నిద్రించడం మంచిది కాదు. ఇలా చేస్తే శక్తి నేరుగా బయటకు వెళ్లిపోతుంది. పురాతన కాలంలో మృతదేహాన్ని తలుపుకి ఎదురుగా ఉంచేవారు. అందుకని దీనిని అశుభంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
నిద్రించే దిశ
వాస్తు ప్రకారం నిద్రించే దిశ కూడా చాలా ముఖ్యమైనది. నిద్రపోయేటప్పుడు సరైన దిశలోనే నిద్రపోవాలి. లేకపోతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. తలను తప్పు దిశలో పెట్టి నిద్రపోవడం వలన మానసిక ఆందోళన, నిద్రలో ఆటంకాలు, ప్రతికూల భావాలు కలుగుతాయి. కాబట్టి బెడ్‌రూమ్‌లో నిద్రపోయేటప్పుడు మంచాన్ని సరైన దిశలో ఉంచాలి. తలను కూడా సరైన దిశలో ఉంచాలి.
సాయంత్రం వేళ నిద్రపోకూడదు
చాలామంది సాయంత్రం వేళల్లో నిద్రపోతారు. కానీ ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేయడం వలన ఇంట్లో ధనం, ఆహారానికి కొరత ఏర్పడుతుంది. సమయానికి నిద్రపోవాలి, ఉదయాన్నే మేల్కొనాలి. అదే మంచి అలవాటు. దాని వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ప్రతి వ్యక్తి నిద్ర అవసరాలు వారి వయసు, ఆరోగ్యం, పని విధానాన్ని బట్టి మారుతాయి.
సానుకూల వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
బెడ్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచాలి. క్రమబద్ధంగా, ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచం చుట్టూ తగినంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. గదిలో సులువుగా కదలడానికి వీలుగా ఉండేటట్టు బెడ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వాస్తు సూత్రాలను పాటిస్తే భద్రత, సౌకర్యం, మంచి నిద్ర కలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం ఉండవు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


