వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో మంచం అమరిక చాలా కీలకం. తలుపుకు నేరుగా మంచం ఉండటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. ఈ వాస్తు దోషాలను ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి.

చాలామంది ఇళ్లలో స్థల పరిమితి వల్లనో, ఇంటి అలంకరణలో భాగంగానో తలుపుకు ఎదురుగా మంచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ, వాస్తు శాస్త్రం దీనిని తీవ్రమైన దోషంగా పరిగణిస్తుంది. బెడ్రూమ్ తలుపు తెరిచిన వెంటనే మంచం కనిపించడం వల్ల, బయట ఉండే ప్రతికూల శక్తులు నేరుగా మీపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరువవ్వడమే కాకుండా, అనవసరమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మీ పడకగదిలో ఇలాంటి అమరిక ఉంటే, అది కలిగించే నష్టాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.
తలుపుకు ఎదురుగా మంచం ఉంటే కలిగే అనర్థాలు
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పడకగది తలుపునకు నేరుగా మంచం ఉంచడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతాయి:
మానసిక ప్రశాంతత లోపం: గదిలోకి ప్రవేశించగానే మంచం కనిపించడం వల్ల మనసు నిలకడగా ఉండదు. ఇది ఇంట్లో అనవసరపు గొడవలకు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కారణమవుతుంది.
ఆర్థిక నష్టాలు: వాస్తు దోషం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించదు. దీనివల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం వంటివి జరుగుతాయి.
దాంపత్య జీవితంపై ప్రభావం: భార్యాభర్తల మధ్య అపార్థాలు, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడానికి ఈ వాస్తు దోషం ఒక కారణం కావచ్చు.
ఆరోగ్య సమస్యలు: సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, అలసట పెరిగి ఆరోగ్యం క్షీణిస్తుంది.
అందుకే, మీ మంచం తలుపుకు నేరుగా ఉంటే, స్థలాన్ని సర్దుబాటు చేసి మంచాన్ని పక్కకు జరపడం ఉత్తమం.
బెడ్రూమ్‌లో పాటించాల్సిన మరికొన్ని వాస్తు నియమాలు
కేవలం మంచం దిశే కాదు, పడకగదిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కూడా మీ జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు.
దేవుని విగ్రహాలు వద్దు: పడకగదిలో పూజా మందిరం ఉండటం లేదా దేవుని చిత్రపటాలు, విగ్రహాలను ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. పడకగది విశ్రాంతి కోసం మాత్రమే, ప్రార్థన కోసం కాదు.
దిశల ప్రాముఖ్యత: పడుకునేటప్పుడు కాళ్లు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు. ఇలా పడుకుంటే కెరీర్లో వైఫల్యాలు, ధన నష్టం కలిగే అవకాశముంది. తల దక్షిణం వైపు ఉంచి పడుకోవడం శ్రేయస్కరం. అలాగే, తూర్పు వైపు కూడా కాళ్లు పెట్టి నిద్రించకూడదని వాస్తు చెబుతోంది.
{{/usCountry}}దిశల ప్రాముఖ్యత: పడుకునేటప్పుడు కాళ్లు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు. ఇలా పడుకుంటే కెరీర్లో వైఫల్యాలు, ధన నష్టం కలిగే అవకాశముంది. తల దక్షిణం వైపు ఉంచి పడుకోవడం శ్రేయస్కరం. అలాగే, తూర్పు వైపు కూడా కాళ్లు పెట్టి నిద్రించకూడదని వాస్తు చెబుతోంది.
{{/usCountry}}మంచంపై భోజనం: పడకగదిలో, మరీ ముఖ్యంగా మంచంపై కూర్చుని భోజనం చేయడం, అలాగే గదిలో ఎంగిలి పాత్రలను ఉంచడం వంటివి చేయకూడదు. ఇది వాస్తు దోషాన్ని పెంచి, జీవితంలో అడ్డంకులను సృష్టిస్తుంది.
నిద్ర అనేది మనిషికి ఎంతో అవసరం. ఆ సమయంలో మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న నియమాలను పాటించడం ద్వారా మీ గదిని సానుకూల శక్తితో నింపుకోండి.