చాలా మంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పెయింటింగ్స్‌ని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో రకరకాల పెయింటింగ్లు, చిత్రాలు వంటివి పెడుతూ ఉంటారు.

ఇవి అందానికే కాదు, వాస్తుని సరి చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వాస్తు దోషాలను తగ్గించే శక్తి వీటికి ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత ఇలా ఎన్నో వాటికి సహాయ పడతాయి. ఈ పెయింటింగ్స్‌ని ఇంట్లో పెట్టడం వలన ఒక్కసారిగా అనేక మార్పులను చూడొచ్చు.
ఇంట్లో ఈ ఐదు పెయింటింగ్స్‌ని పెట్టండి. వాస్తు దోషాలు తగ్గి, సంతోషం పెరుగుతుంది
1.సూర్యోదయం
సూర్యోదయానికి సంబంధించిన పెయింటింగ్స్ లేదా చిత్రాలను ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ పెయింటింగ్‌ని ఇంట్లో పెట్టినప్పుడు తూర్పు వైపు పెట్టడం మంచిది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. బాగా కలిసి వస్తుంది.
2.ఏడు గుర్రాల ఫోటో
ఏడు గుర్రాల ఫోటో లేదా పెయింటింగ్ ఇంట్లో పెట్టడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వాస్తు ప్రకారం ఈ ఫోటో లేదా పెయింటింగ్‌ని దక్షిణ దిశలో పెట్టడం మంచిది. బెడ్‌రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్‌లో పెడితే శుభ ఫలితాలను చూడొచ్చు.
3.రాధాకృష్ణుల ఫోటో
రాధాకృష్ణుల ఫోటోను చాలా మంది బెడ్రూమ్లో పెడుతూ ఉంటారు. నిజానికి ఈ ఫోటోని ఉంచడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
4.ఎగురుతున్న హంసలు
{{/usCountry}}రాధాకృష్ణుల ఫోటోను చాలా మంది బెడ్రూమ్లో పెడుతూ ఉంటారు. నిజానికి ఈ ఫోటోని ఉంచడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
4.ఎగురుతున్న హంసలు
{{/usCountry}}ఎగురుతున్న హంసలు లేదా ఇతర పక్షుల ఫోటోలను ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ పెయింటింగ్‌ని ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టడం మంచిది. దీనితో సంపద పెరుగుతుంది. సానుకూల శక్తి కూడా ఎక్కువ అవుతుంది.
5.తామర పువ్వుల ఫోటోలు
ఈ ఫోటోలు లేదా పెయింటింగ్లను కూడా ఇంట్లో పెట్టండి. ఇవి కూడా సానుకూల శక్తిని తీసుకురావడానికి సహాయం చేస్తాయి. లివింగ్ రూమ్‌లో పెడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
ఈ పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టడం వలన ఇల్లు అందం పెరగడంతో పాటుగా పైన చెప్పిన లాభాలు అన్నిటిని పొందవచ్చు. సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నీ కూడా తగ్గుతాయి.