మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తలస్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది, అలాగే కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. తలస్నానానికి ఆ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే అసలు మంచిది కాదు. మరి మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే మార్చుకోండి.
ఆడవాళ్లు ఏ రోజు తలస్నానం చేయాలి, ఏ రోజు తలస్నానం చేయకూడదు:
సోమవారం తలస్నానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది

సోమవారం చంద్రుడికి సంబంధించినది కనుక ఆ రోజు తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రశాంతతని పెంపొందించుకోవచ్చు, శాంతి ఉంటుంది. మహిళలు సోమవారం తలస్నానం చేయడం శుభప్రదమైనది.
బుధవారం తలస్నానం చేస్తే మంచిది
బుధవారం నాడు మహిళలు తలస్నానం చేయడం మంచిదే. ఆ రోజు తలస్నానం చేయడం వలన ఏ ఇబ్బంది ఉండదు, శుభ ఫలితాలు సూచిస్తుంది. కాబట్టి బుధవారం నాడు తలస్నానం చేస్తే కూడా మంచిదే.
గురువారం ఐశ్వర్యం కలుగుతుంది
గురువారం తలస్నానం చేస్తే మంచిది. గురువు అంటే శ్రేయస్సు, ఆశీస్సులు. గురువారం నాడు మహిళలు తలస్నానం చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది, ఆశీస్సులు కలుగుతాయి. కాబట్టి గురువారంనాడు కుదిరితే మహిళలు తలస్నానం చేయడం మంచిది.
శుక్రవారం శక్తివంతమైన రోజు
శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. శుక్రుడు మనసు, ఆకర్షణకు తారకుడు. డబ్బు, సంపద, విలాసాలని అందిస్తాడు. శుక్రవారం నాడు తలస్నానం చేస్తే కూడా ఏ ఇబ్బంది ఉండదు. శుభ ఫలితాలే కలుగుతాయి.
ఈ రోజుల్లో తలస్నానం చేయడం మంచిది కాదు:
ఆదివారం: ఇబ్బందులు వస్తాయి. ఆదివారం నాడు తలస్నానం చేయడం వలన అలసట పెరుగుతుంది. శక్తి ప్రవాహంలో కూడా మార్పు ఉంటుంది. కాబట్టి ఆ రోజు తలస్నానం చేయకుండా ఉండడమే మంచిది.
శనివారం: శనివారం కూడా తలస్నానం చేయకపోవడం మంచిది. శనివారం తలస్నానం చేస్తే జుట్టు రాలడం వంటివి ఎదుర్కోవచ్చు. శని దేవుడు బరువు, ఆలస్యాన్ని సూచిస్తాడు.
{{/usCountry}}శనివారం: శనివారం కూడా తలస్నానం చేయకపోవడం మంచిది. శనివారం తలస్నానం చేస్తే జుట్టు రాలడం వంటివి ఎదుర్కోవచ్చు. శని దేవుడు బరువు, ఆలస్యాన్ని సూచిస్తాడు.
{{/usCountry}}మంగళవారం: మంగళవారం కూడా మహిళలు తలస్నానం చేయకపోతేనే బెస్ట్. కుజ గ్రహం స్వభావానికి ఆడవాళ్లు ఆరోజు తలస్నానం చేయడం ఏ మాత్రం మంచిది కాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. పండుగ రోజుల్లో ఏ వారమైనా తలస్నానం చేయవచ్చా?
పండుగలు, వ్రతాలు లేదా ఏదైనా పుణ్యకార్యాలు ఉన్నప్పుడు వారంతో సంబంధం లేకుండా తలస్నానం చేయవచ్చు. అటువంటి సమయాల్లో సంప్రదాయ నియమాల కంటే ఆచారానికే ప్రాముఖ్యత ఉంటుంది.
2. మహిళలు మంగళవారం తలస్నానం చేయకూడదా?
సాధారణంగా మంగళవారం తలస్నానం చేయడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో లేదా అనారోగ్యం నుంచి కోలుకున్నప్పుడు మినహాయింపులు ఉంటాయి.
3. తలస్నానం చేయడానికి ఉత్తమ సమయం ఏది?
సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయ సమయంలో తలస్నానం చేయడం అత్యంత శ్రేష్ఠం. దీనివల్ల శరీరానికి తాజాదనం రావడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేలు జరుగుతుంది.