నేటి బిజీ లైఫ్‌లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్రీమద్భగవద్గీత ఎలా మార్గదర్శకం చేస్తుందో తెలుసుకోండి. ఇంద్రియ నిగ్రహం, ఆత్మసంయమనం ద్వారా అశాంతిని దూరం చేసుకునే మార్గాలు.

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరిని నీడలా వెంటాడుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆఫీస్ టెన్షన్లు, భవిష్యత్తు గురించిన బెంగ, కుటుంబ బాధ్యతల ఒత్తిడి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ బిజీ వాతావరణంలో చాలా మంది ప్రశాంతతను కోల్పోయి సతమతమవుతున్నారు. ఇలాంటి అశాంతి సమయాల్లోనే వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. గీతలోని ప్రతి శ్లోకం నేటి ఆధునిక మానవుడి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.
మానసిక ప్రశాంతతకు గీత మార్గం
శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయం 64వ శ్లోకం మానసిక ప్రశాంతతకు అత్యంత కీలకమైన సూత్రం చెబుతోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎవరైతే రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ, తన ఇంద్రియాలను పూర్తిగా అణచివేసి, మనసును నియంత్రణలో ఉంచుకుంటాడో, ఆ వ్యక్తి మాత్రమే అంతిమంగా శాంతిని పొందగలడు.
శ్రీకృష్ణుడి ఈ బోధన నేటి డిజిటల్ యుగంలోనూ వంద శాతం వర్తిస్తుంది. నేడు మనిషిని ఎక్కువగా బాధిస్తున్నది ఇంద్రియాలపై పట్టులేకపోవడమే. కోరికలు హద్దు మీరుతున్న కొద్దీ అసంతృప్తి పెరిగి ఒత్తిడి తలెత్తుతుంది.
పరిస్థితులు కాకపోయినా.. ఆలోచనా విధానమే సమస్య
చాలా మంది తమ ఇబ్బందులకు కేవలం బాహ్య పరిస్థితులే కారణమని భావిస్తుంటారు. కానీ, గీత ఇక్కడ మనకొక పెద్ద సత్యాన్ని బోధిస్తుంది. సమస్య బయట పరిస్థితుల్లో లేదు, వాటిని మనం చూసే విధానంలో, స్పందించే తీరులోనే అసలు లోపం ఉంటుందని వివరిస్తుంది.
ఏదైనా ఒక ఫలితంపై అతిగా ఆశపడటం, పక్కవారితో మనల్ని పోల్చుకోవడం, ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగాలని కోరుకోవడం వల్ల నిరాశ పెరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మన దృక్పథాన్ని మార్చుకుంటే కొండంత కష్టమైనా మార్చచ్చు.
మనసు, ఇంద్రియాలపై పట్టు ఎందుకు ముఖ్యం?
శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఎవరైతే తన మనసును, ఇంద్రియాలను శాసించగలరో వారు జీవితంలో ఎలాంటి కష్టకాలం ఎదురైనా చలించిపోరు. అలాంటి వ్యక్తులు కోపం, అసూయ, భయం వంటి రుణాత్మక భావాలను తనపై ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించనివ్వరు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, మానసిక దారుఢ్యాన్ని ఇస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవడం మాటలు చెప్పినంత సులువు కాదు. కానీ, క్రమమైన అభ్యాసం, ఓర్పు, ఆత్మపరిశీలన ద్వారా ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. నిజమైన స్వేచ్ఛ అనేది ఇంద్రియ నిగ్రహం ద్వారానే వస్తుంది.
చిన్న అలవాట్లతోనే పెద్ద మార్పులు
{{/usCountry}}శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఎవరైతే తన మనసును, ఇంద్రియాలను శాసించగలరో వారు జీవితంలో ఎలాంటి కష్టకాలం ఎదురైనా చలించిపోరు. అలాంటి వ్యక్తులు కోపం, అసూయ, భయం వంటి రుణాత్మక భావాలను తనపై ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించనివ్వరు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, మానసిక దారుఢ్యాన్ని ఇస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవడం మాటలు చెప్పినంత సులువు కాదు. కానీ, క్రమమైన అభ్యాసం, ఓర్పు, ఆత్మపరిశీలన ద్వారా ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. నిజమైన స్వేచ్ఛ అనేది ఇంద్రియ నిగ్రహం ద్వారానే వస్తుంది.
చిన్న అలవాట్లతోనే పెద్ద మార్పులు
{{/usCountry}}గీతా సారం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాలేదు, అది పూర్తిగా ఆచరణాత్మకమైనది. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడం, అనవసరమైన పోలికలకు స్వస్తి చెప్పడం, వర్తమానంలో బతకడం నేర్చుకోవడం వంటి చిన్న చిన్న జీవనశైలి మార్పులు మానసిక ఒత్తిడిని తీసుకొస్తాయి. జీవితంలోని ప్రతీదీ మన కంట్రోల్‌లో ఉండదు. కానీ, వాటికి మనం ఇచ్చే స్పందన మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న అలవాట్లే భవిష్యత్తులో పెద్ద మార్పుని తెస్తాయి.