హిందూ సనాతన ధర్మంలో శ్రీమద్భగవద్గీతకు అత్యున్నత స్థానం ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రంథం కేవలం పూజలకు పరిమితమైనది కాదు; మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి మానసిక సంఘర్షణకు ఇది ఒక దిక్సూచి.

కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఏం చేయాలో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతాసారం నేటి ఆధునిక కాలంలోనూ మనిషి పురోగతికి మార్గదర్శకం అవుతోంది. మనిషి తన జీవితంలో ఎదుర్కొనే దుఃఖాలకు, అశాంతికి తనలోని కొన్ని చెడు అలవాట్లే కారణమని గీత స్పష్టం చేస్తోంది.
పతనానికి దారితీసే మూడు మార్గాలు
శ్రీమద్భగవద్గీతలోని పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకంలో మనిషి సర్వనాశనానికి తలుపులు తెరిచే మూడు ప్రధాన దుర్గుణాల గురించి శ్రీకృష్ణుడు స్పష్టంగా హెచ్చరించారు. ఈ దుర్గుణాలే మనిషిని నిరంతరం అశాంతి వైపు నడిపిస్తాయని ఆయన బోధించారు.
"కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్" అని భగవద్గీత పేర్కొంటోంది. అంటే అతి కోరిక, కోపం, దురాశ అనే ఈ మూడు ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలని శ్రీకృష్ణుడు చెప్పారు.
అతి కోరిక (హద్దులు దాటిన ఆశలు)
జీవితంలో కోరికలు ఉండటం సహజమే. కానీ అవి హద్దులు దాటితే సర్వనాశనం తప్పదు. కోరికలు తీరకపోతే మనిషిలో అసంతృప్తి మొదలవుతుంది. ఆ అశాంతి అతన్ని అక్రమ మార్గాల వైపు, అబద్ధాల వైపు నడిపిస్తుంది. ఇతరుల విజయాలను చూసి అసూయపడేలా చేస్తుంది. అందుకే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరమని గీత బోధిస్తోంది.
కోపం (ఆవేశం – సరైన ఆలోచన కోల్పోవడం)
కోపం మనిషికి అతిపెద్ద శత్రువు. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు మనిషి మంచి–చెడులను గుర్తించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే ఛిన్నాభిన్నం చేస్తాయి. కోపం వల్ల ఇతరులను దూషించడం, హింసకు పాల్పడటం జరుగుతుంది. అందుకే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకూడదని గీత బోధిస్తోంది.
దురాశ (అత్యాశ – స్వార్థం)
డబ్బుపై లేదా వస్తువులపై అతిగా ఆశపడటమే దురాశ. ఈ దురాశ మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుంది. పదిమందితో కలిసిమెలిసి ఉండే మనిషిని ఒంటరిగా చేస్తుంది. అన్యాయంగా సంపాదించాలనే ఆలోచనను ప్రేరేపిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న దానితో సంతృప్తి చెందకుండా, ఇతరుల ఆస్తిపై కన్నేసేలా చేసే ఈ దురాశే మనిషి జీవితాన్ని నరకంలా మారుస్తుంది.
{{/usCountry}}డబ్బుపై లేదా వస్తువులపై అతిగా ఆశపడటమే దురాశ. ఈ దురాశ మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుంది. పదిమందితో కలిసిమెలిసి ఉండే మనిషిని ఒంటరిగా చేస్తుంది. అన్యాయంగా సంపాదించాలనే ఆలోచనను ప్రేరేపిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న దానితో సంతృప్తి చెందకుండా, ఇతరుల ఆస్తిపై కన్నేసేలా చేసే ఈ దురాశే మనిషి జీవితాన్ని నరకంలా మారుస్తుంది.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.