ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు డబ్బులు బాగా సంపాదిస్తారు, చిన్న వయస్సులోనే కోటీశ్వరులు అవుతారు!
పుట్టిన టైంకి చంద్రుడు ఉన్న నక్షత్రం మన ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను నిర్ణయించడానికి ప్రభావం చూపిస్తుంది. నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలని పొందుతారు. ఆర్థికంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది.
పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే పుట్టిన నక్షత్రాలను బట్టి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన టైంకి చంద్రుడు ఉన్న నక్షత్రం మన ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను నిర్ణయించడానికి ప్రభావం చూపిస్తుంది. నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలని పొందుతారు. ఆర్థికంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఆ నక్షత్రాలు వారు ఎవరు? ఈ నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా ఉందేమో చూసుకోండి.

ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు ఎప్పుడూ డబ్బు బాగా సంపాదిస్తారు.. జీవితంలో వెలుగులే!
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎప్పుడూ కూడా డబ్బుని ఎలా సంపాదించాలో ప్లానింగ్‌తో ఉంటారు. ఈ నక్షత్రం వారు వ్యవసాయం, వ్యాపారం, మీడియా రంగాల్లో బాగా దూసుకెళ్తారు. ఎలాంటి పనిని మొదలుపెట్టినా పై స్థాయికి వెళ్ళిపోతారు. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అందుకే ఎప్పుడూ వీరి జీవితంలో వెలుగులు ఉంటాయి.
ధనిష్ఠ నక్షత్రం
ధనిష్ఠ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు డబ్బును సులువుగా సంపాదిస్తారు. వీరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాంతో ముందుకు వెళ్లిపోతారు. కష్టపడడం, తెలివితేటలు ఇవి రెండూ వీరికి పెద్ద ప్లస్ అవుతాయి. రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కోటీశ్వరులుగా మారే అవకాశాలు ఎక్కువ.
శ్రవణ నక్షత్రం
శ్రవణ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎప్పుడూ కూడా బాగా డబ్బు సంపాదిస్తారు. మేనేజ్మెంట్, విద్య, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో వీరికి బాగా కలిసి వస్తుంది. ఎల్లప్పుడూ మంచి తెలివితేటలతో, కష్టంతో దూసుకెళ్ళిపోతారు. ఓటమి అనేది వీరికి తెలియదు.
పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి పై స్థాయికి వెళ్తారు. స్థిరాస్తులను, ధనాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని డబ్బులు బాగా సంపాదిస్తారు.
ఉత్తరాషాడ నక్షత్రం
ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చిన్న వయసులోనే మంచి స్థాయికి చేరుకుంటారు. ఆస్తులు, స్థిరాస్తులను సంపాదించుకుంటారు. వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఎక్కువ డబ్బులు తక్కువ సమయంలోనే సంపాదిస్తారు. అలాగే సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


