ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బుని బాగా ఆదా చేస్తారు.. ఎప్పుడూ డబ్బులు ఫుల్లుగా ఉంటాయి!

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం డబ్బును బాగా ఆదా చేస్తారు.

Published on: Nov 20, 2025, 12:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బుని బాగా ఆదా చేస్తారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బుని బాగా ఆదా చేస్తారు (pinterest)

కొంతమంది డబ్బును ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం డబ్బును బాగా ఆదా చేస్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వారి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బును అనవసరంగా వృథా చేయరు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా ఆదా చేస్తారు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 2

ఏదైనా నెలలో 2,11, 20 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు చంద్రుడితో సంబంధం ఉంటుంది. ఈ సంఖ్య వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాగే ఇతరులను కూడా బాగా అర్థం చేసుకుంటారు, ఆకట్టుకుంటారు.

అందరినీ ఆకట్టుకుంటారు

ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి, జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. డబ్బును బాగా ఆదా చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బుని బాగా సేవ్ చేస్తారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, కుటుంబానికి ఏ సమస్య రాకుండా ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు.

కష్టపడి పని చేస్తారు

ప్రతి టాస్క్‌ను కూడా చక్కగా పూర్తి చేస్తారు. పనిని ఇష్టంగా, ఆసక్తితో పూర్తి చేస్తారు. ఒక‌రే కూర్చుని దృష్టి పెట్టి పనులను పూర్తి చేస్తారు. టైంకి వాటిని పూర్తయ్యేలా చూసుకుంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా చూడలేరు.

ఈ రంగాలు బాగా కలిసి వస్తాయి

అగ్రికల్చర్, న్యాయం, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, డైరీ, హెల్త్ సర్వీసెస్, కన్సల్టెన్సీ వంటి రంగాలు ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి.

బలహీనత

ఎవరైనా తియ్యగా మాట్లాడితే మాత్రం కరిగిపోతారు. ఇదే ఈ తేదీల్లో పుట్టిన వారి బలహీనత. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. మంచిగా ఉండడం వలన ప్రేమ జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More