ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం బాగా కలిసి వస్తుంది.. ఆనందం, అదృష్టం రెట్టింపు!
ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన తేదీ ఆధారంగా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీళ్లు బంగారాన్ని ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం, శ్రేయస్సు కూడా కలుగుతుంది.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన తేదీ ఆధారంగా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది.

వీళ్లు బంగారాన్ని ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం, శ్రేయస్సు కూడా కలుగుతుంది. బంగారం గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది? వారిలో మీరు ఒకరేమో చెక్ చేసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారాన్ని ధరిస్తే బాగా కలిసి వస్తుంది
రాడిక్స్ నెంబర్ 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను ఎంతో ధైర్యంగా స్వీకరించి ముందుకు వెళ్తారు. కష్టపడి పని చేస్తారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు విజేతలుగా నిలబడాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కాస్త మొండితనం కూడా ఎక్కువే. ఈ తేదీల్లో పుట్టిన వారికి అధిపతి సూర్యుడు. కనుక బంగారం బాగా కలిసొస్తుంది. బంగారం ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.
రాడిక్స్ సంఖ్య 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది.
రాడిక్స్ సంఖ్య 3
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురుడు. నాయకత్వ లక్షణాలు, క్రియేటివిటీ వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఈ తేదీల్లో పుట్టిన వారికి ఉండడంతో డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక పరంగా బావుంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే మరింత శుభ ఫలితాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


