ఈ తేదీల్లో పుట్టిన వారు వెండిని ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.. అంతా మంచే జరుగుతుంది!
న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడంతో పాటు ప్రవర్తన, తీరు గురించి కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడికి సంబంధించినది. అదృష్టం, శ్రేయస్సు, మనసు ప్రశాంతత వంటి వాటికి కారకుడు చంద్రుడు.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడంతో పాటు ప్రవర్తన, తీరు గురించి కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడికి సంబంధించినది. అదృష్టం, శ్రేయస్సు, మనసు ప్రశాంతత వంటి వాటికి కారకుడు చంద్రుడు. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం ఉంటుంది. ఒకరి బలహీనతలు మరొకరి బలాలు కావచ్చు.

ఒకరి బలాలు మరొకరి బలహీనతలు కావచ్చు. ప్రతిొక్కరి స్వభావ తీరు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏ రాడిక్స్, ఆ నెంబర్ వారికి వెండి బాగా కలిసి వస్తుంది? వెండి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అదృష్టాన్ని తీసుకు వస్తుంది:
న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి వెండి బాగా కలిసి వస్తుంది. వెండిని ధరించడం వలన ఆనందం, సౌకర్యం ఉంటాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. మరి మీకు కూడా వెండి కలిసి వస్తుందో లేదో ఇప్పుడే తెలుసుకోండి.
రాడిక్స్ నెంబర్ 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడికి వజ్రం, రాగి అదృష్టం తీసుకు వస్తాయి. శుక్రుడికి చంద్రుడికి మధ్య స్నేహ సంబంధం ఉంది. కాబట్టి ఈ సంఖ్యలు వారు వెండి ఆభరణాలు ధరిస్తే సానుకూల ఫలితాలను చూస్తారు. ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ రాడిక్స్ సంఖ్యల వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.
రాడిక్స్ నెంబర్ 2
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు వెండిని ధరించడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది, మానసిక స్పష్టత ఉంటుంది, అదృష్టం కూడా ఎక్కువవుతుంది. కుడి చేతికి ఈ తేదీల్లో పుట్టిన వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే మంచిది. వెండి గొలుసు కూడా ధరించవచ్చు.
రాడిక్స్ నెంబర్ 4
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ తేదీల్లో పుట్టిన వారు గోమేధికాన్ని వెన్నుతో కలిపి ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. శనివారం నాడు ఆంజనేయస్వామిని లేదా కాలభైరవుని ఆరాధిస్తే అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


