ఈ రాశులు వారు డైమండ్స్‌ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి.. తస్మాత్ జాగ్రత్త!

చాలా మందికి డైమండ్స్‌ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు. కానీ కొన్ని రాశుల వారు ధరించడం మంచిది కాదు. ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు కచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి. 

Published on: Nov 14, 2025, 16:30:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామందికి డైమండ్స్‌ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే డైమండ్స్‌ని ఎవరు ధరిస్తే మంచిది? ఎవరు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇవి చాలా విలువైనవి, చాలా శక్తివంతమైన రత్నాలు. వీటిని చాలామంది ధరిస్తూ ఉంటారు. వజ్రాన్ని ధరించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వజ్రానికి శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. వజ్రాన్ని ధరిస్తే సంతోషం, డబ్బు వంటివి కలుగుతాయి.

ఈ రాశులు వారు డైమండ్స్‌ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి (pinterest)
ఈ రాశులు వారు డైమండ్స్‌ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి (pinterest)

వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు. కానీ కొన్ని రాశుల వారు ధరించడం మంచిది కాదు. ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు కచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి. ఈ రాశుల వారు వజ్రాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయి. మరి ఏ రాశుల వారు వజ్రాన్ని ధరించకూడదు? ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులు వారు డైమండ్స్‌ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి

1.మేష రాశి

మేష రాశి వారు వజ్రాలను ధరించకూడదు. ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కూడా సమస్యలు రావచ్చు. కనుక ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి వజ్రాలు దురదృష్టాన్ని తీసుకువస్తాయి. అదృష్టం తొలగిపోతుంది. ఈ రాశి వారు వజ్రాన్ని ధరించేటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు రావచ్చు.

3.సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు కూడా వజ్రాలను ధరించడం మంచిది కాదు. వజ్రాలను ధరిస్తే నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గౌరవ–మర్యాదలు తగ్గిపోతాయి. ఫెయిల్యూర్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య సలహా తీసుకుని మాత్రమే ధరించడం మంచిది. లేదంటే ఇబ్బందులు రావచ్చు.

4.మీన రాశి

మీన రాశి వారు కూడా వజ్రాలను ధరించకూడదు. వజ్రాలను ధరిస్తే సమస్యలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితంలో ఇబ్బందులు వచ్చి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాధ కూడా ఎదురవుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More