బుద్ధ పూర్ణిమ 2026: ఈసారి వచ్చే పూర్ణిమ తిథి చాలా ప్రత్యేకం.. తేదీ, సమయంతో పాటు పరిహారాలు తెలుసుకోండి!
పూర్ణిమ తిథి లక్ష్మీ దేవికి ప్రీతికరమైనది. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శాంతికి ప్రతిరూపమైన గౌతమ బుద్ధుడి జన్మదినం అంటే బుద్ధ పూర్ణిమ. ఈ ఏడాది మే నెలలో వచ్చే ఈ పర్వదినం విశిష్టత, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోండి.
హిందూ ధర్మంలో వైశాఖ పూర్ణిమకు ఎంతో పవిత్రత ఉంది. ఈ రోజునే బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించారు. అందుకే దీనిని 'బుద్ధ జయంతి' లేదా 'వైశాఖ పూర్ణిమ' అని కూడా పిలుస్తారు. 2026 సంవత్సరంలో మే 1వ తేదీన బుద్ధుని 2588వ జయంతిని జరుపుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా ఈరోజు కేవలం బుద్ధుడికి మాత్రమే కాదు, అష్టలక్ష్ములకు, చంద్ర దేవుడికి కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున చేసే స్నాన, దానాల వల్ల వంశపారంపర్యంగా వచ్చే దోషాలు తొలగిపోయి, ఇంట్లో సుఖసంపదలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం.

బుద్ధ పూర్ణిమ 2026: తేదీ, శుభ ముహూర్తం
హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ రాత్రి నుంచే ప్రారంభమవుతుంది.
పూర్ణిమ తిథి ప్రారంభం: ఏప్రిల్ 30, 2026 సాయంత్రం 09:13 గంటలకు.
పూర్ణిమ తిథి ముగింపు: మే 01, 2026 రాత్రి 10:52 గంటలకు.
ముఖ్య గమనిక: ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి, మే 1, శుక్రవారం నాడు బుద్ధ పూర్ణిమ వ్రతం, పుణ్య స్నానాలు, దానధర్మాలు నిర్వహించుకోవాలి.
శుభ ముహుర్తాలు
బుద్ధ పూర్ణిమ రోజున వివిధ పనులు నిర్వహించడానికి కింది ముహూర్తాలు అనుకూలమైనవి:
బ్రహ్మ ముహూర్తం (స్నానానికి ఉత్తమం): ఉదయం 04:15 నుంచి 04:58 వరకు.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు.
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 02:31 నుంచి 03:24 వరకు.
అమృత కాలం: సాయంత్రం 06:56 నుంచి రాత్రి 08:41 వరకు.
భద్ర కాలం ప్రభావం: మే 1 ఉదయం 05:41 నుంచి 10:00 గంటల వరకు భద్ర కాలం ఉన్నప్పటికీ, ఈ సమయంలో చంద్రుడు తులా రాశిలో సంచరిస్తున్నందున పృథ్వీ లోకం (భూమి)పై భద్ర ప్రభావం ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాబట్టి భక్తులు ఎటువంటి భయం లేకుండా తమ పూజా కార్యక్రమాలను కొనసాగించవచ్చు.
లక్ష్మీ కటాక్షం కోసం ఈ పరిహారాలు చేయండి
వైశాఖ పూర్ణిమ నాడు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గులు ఇవి
రావి చెట్టు పూజ: పూర్ణిమ రోజున రావి చెట్టులో లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున రావి చెట్టుకు నీరు సమర్పించి పూజించడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
చంద్రుడికి అర్ఘ్యం: రాత్రి సమయంలో చంద్రుడికి పాలు, నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోతాయి.
సత్యనారాయణ స్వామి వ్రతం: ఆ రోజున సత్యనారాయణ స్వామి కథ పఠించడం లేదా వినడం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు.
దాన ధర్మాలు: సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం లేదా వస్త్ర దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


