జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థితిగతులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బుద్ధికి, వ్యాపారానికి కారకుడైన బుధ గ్రహం సంచారం చేసేటప్పుడు జాతక చక్రంలో కీలక మార్పులు సంభవిస్తాయి. 2026 మే 29, శుక్రవారం నాడు బుధుడు తన స్వరాశి అయిన మిథునంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించే 'భద్ర రాజయోగం' ఏర్పడుతోంది.

అంతేకాకుండా, మిథున రాశిలో ఇప్పటికే ఉన్న శుక్రుడితో బుధుడు జతకట్టడం వల్ల జూన్ 8 వరకు 'లక్ష్మీ నారాయణ రాజయోగం' కూడా కొనసాగుతుంది. ఈ రెండు రాజయోగాలు ఒకేసారి సిద్ధించడం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. బుధ, శుక్రుల కలయిక వల్ల కళలు, వ్యాపారం, ఐశ్వర్యం మరియు మేధస్సు రెట్టింపు అవుతాయి. ఈ అద్భుత యోగాల వల్ల ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి బుధుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండో స్థానం ధనానికి, కుటుంబానికి సంబంధించింది. లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల మీ ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల వైపు నుంచి మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. అదృష్టం మీ వెంటే ఉండటం వల్ల పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.
కన్య రాశి:
కన్య రాశి వారికి బుధ, శుక్రుల కలయిక పదో స్థానంలో (కర్మ స్థానం) జరుగుతోంది. ఇది ఉద్యోగ, వృత్తి పరంగా అత్యంత శుభప్రదమైన సమయం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి పై అధికారులు మీకు మంచి అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మాట తీరు చాలా మధురంగా మారుతుంది, దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కీలక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా మీరు చాలా బలంగా తయారవుతారు.
కుంభ రాశి:
{{/usCountry}}కన్య రాశి వారికి బుధ, శుక్రుల కలయిక పదో స్థానంలో (కర్మ స్థానం) జరుగుతోంది. ఇది ఉద్యోగ, వృత్తి పరంగా అత్యంత శుభప్రదమైన సమయం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి పై అధికారులు మీకు మంచి అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మాట తీరు చాలా మధురంగా మారుతుంది, దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కీలక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా మీరు చాలా బలంగా తయారవుతారు.
కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి బుధ సంచారం ఐదో స్థానంలో జరుగుతోంది. లక్ష్మీ నారాయణ రాజయోగ ప్రభావంతో మీకు మంచి రోజులు మొదలైనట్టే. వ్యాపారం మళ్ళీ పుంజుకుంటుంది. పాత బకాయిలు వసూలవ్వడంతో పాటు, కొత్త మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో మీరు సాధించే కొత్త విజయాలు మీకు మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని ఇస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంతానం కలిగించే సంతోషం మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని నింపుతుంది.
మీన రాశి:
మీన రాశి వారికి బుధుడు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు. నాలుగో స్థానం సుఖ సంతోషాలకు, వాహనాలకు, భూమికి సంకేతం. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు నచ్చిన ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కెరీర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, అనుబంధం బలపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన కాలం.
గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు గ్రహాల గోచార స్థితిపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గ్రహాల బలాబలాలను బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది.