కర్కాటకంలో లక్ష్మీనారాయణ యోగం - వృషభం, మిథునంతో సహా 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగం!
జూన్ 2026లో కర్కాటక రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన సంయోగం వల్ల వృషభం, మిథునం, కన్య, వృశ్చిక రాశుల వారికి అదృష్టం వరించనుంది.
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల ప్రకారం, నవగ్రహాలలో బుద్ధి, వ్యాపారానికి కారకుడైన బుధుడు.. సంపద, వైభవానికి కారకుడైన శుక్రుడితో జతకట్టబోతున్నాడు. ఈ రెండు శుభ గ్రహాల కలయికను జ్యోతిష్య నిపుణులు అత్యంత పవిత్రమైనదిగా…. ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూన్ నెలలో చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది. ఈ కలయిక వల్ల జ్యోతిష్యశాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైన 'లక్ష్మీనారాయణ యోగం' ఉద్భవించబోతోంది.

గ్రహాల సంచార క్రమాన్ని పరిశీలిస్తే… జూన్ 8వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి అడుగుపెడతాడు. ఈ విధంగా జూన్ 22 నుంచి కర్కాటక రాశిలో బుధ-శుక్రుల యుతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల పలు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ కాలం బంగారు భవిష్యత్తును ప్రసాదించబోతోంది.
- వృషభ రాశి : బుధ-శుక్రుల సంయోగం వృషభ రాశి వారికి జీవితంలోని అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా, గతంలో నిలిచిపోయిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా ముందుకు సాగుతాయి.
- మిథున రాశి : మిథున రాశి వారికి ఈ కాలంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విరివిగా డబ్బు చేతికి అందడంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో అప్రతిహత విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
- కన్యా రాశి : కన్యా రాశి వారు తమ కార్యాలయంలో కొత్త గుర్తింపును సొంతం చేసుకుంటారు. మీ ప్రతిభను, నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి, వాటిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపార రంగంలో లాభాల బాట పడతారు. కొత్త వ్యాపారాలు లేదా పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు (పదోన్నతులు) లభించే సూచనలు బలంగా ఉన్నాయి.
- వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు అందుతాయి. ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుండి ఆశించిన పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి సానుకూల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆస్తులు, పెట్టుబడుల రంగంలో ఉన్నవారికి ఈ బుధ-శుక్రుల కలయిక అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
లక్ష్మీనారాయణ యోగం ప్రత్యేకత…?
జ్యోతిష్యశాస్త్ర నియమాల ప్రకారం….. బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసి ప్రయాణించినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం వల్ల సదరు వ్యక్తికి అపారమైన జ్ఞానం… సమాజంలో ఉన్నత స్థానం లభిస్తాయి. వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఈ యోగం జాతకంలో బలంగా ఉంటే, తక్కువ శ్రమతోనే అత్యధిక ఫలితాలను, సుఖసంతోషాలను సాధించవచ్చని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

