డబుల్ రాజయోగాల ధమాకా.. గజకేసరి తర్వాత గజలక్ష్మి యోగం.. 4 రాశులకు అఖండ ధనయోగం!

డబుల్ రాజయోగాల ధమాకా: ప్రస్తుతం కుజ, గురు ప్రభావంతో గజకేసరి యోగం నడుస్తుండగా, జూన్ 8 నుంచి అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం ప్రారంభం కానుంది. దీని వల్ల 4 రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Published on: Jun 4, 2026, 13:52:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డబుల్ రాజయోగాల ధమాకా: జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల నడక మారినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో రెండు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు సాకారం కాబోతున్నాయి. ప్రస్తుతం జూన్ 4వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంత్యంత పవిత్రమైన 'గజకేసరి రాజయోగం' నడుస్తోంది. జాతకంలో చంద్రుడికి కేంద్ర స్థానంలో (1, 4, 7, 10 ఇళ్లలో) గురు గ్రహం ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు నీచ స్థానంలో లేకుండా, అస్తమించకుండా ఉండి.. శుక్ర, బుధ, గురు గ్రహాల వీక్షణం ఉన్నప్పుడు కూడా ఈ అద్భుత యోగం పడుతుంది.

డబుల్ రాజయోగాల ధమాకా.. గజకేసరి తర్వాత గజలక్ష్మి యోగం.. 4 రాశులకు అఖండ ధనయోగం!
డబుల్ రాజయోగాల ధమాకా.. గజకేసరి తర్వాత గజలక్ష్మి యోగం.. 4 రాశులకు అఖండ ధనయోగం!

"గజకేసరి యోగంలో జన్మించిన వారు లేదా ఈ యోగ ప్రభావం ఉన్న కాలంలో వ్యక్తులు శత్రువులపై విజయం సాధిస్తారు. వీరి మాటతీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాచరికపు సుఖాలు, సకల సద్గుణాలు కలిగి ఉంటూ దీర్ఘాయుష్షును పొందుతారు," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ యోగం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరగడంతో పాటు సమాజంలో ఉన్నత స్థాయి జీవనాన్ని గడుపుతారు.

జూన్ 8 నుంచి గజలక్ష్మి రాజయోగం

గజకేసరి యోగం ముగిసిన వెంటనే జూన్ 8వ తేదీ నుంచి మరో అద్భుతమైన 'గజలక్ష్మి రాజయోగం' ప్రారంభం కానుంది. దేవగురు బృహస్పతి, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 8న సంపదలకు అధిపతి అయిన శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

జూలై వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉంటాడు. దీనివల్ల కర్కాటక రాశిలో గురు, శుక్రుల కలయిక జరిగి గజలక్ష్మి రాజయోగం సాకారమవుతుంది. ఈ రెండు రాజయోగాల బ్యాక్-టు-బ్యాక్ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి గజలక్ష్మి రాజయోగం కెరీర్ పరంగా ఊహించని విజయాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లతో పాటు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం రెట్టింపు కావడంతో పాత అప్పుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా అండగా నిలుస్తుంది. ఎక్కడో నిలిచిపోయిన డబ్బు లేదా గతంలో ఎవరికైనా ఇచ్చి రాదనుకున్న నగదు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. గత పెట్టుబడుల నుంచి భారీగా రిటర్న్స్ వస్తాయి. ధన ప్రవాహం నిరంతరం కొనసాగడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

కర్కాటక రాశి

ఈ గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి లక్ష్మీదేవి అపరిమితమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. శుక్రుడి సంచారం వల్ల విలాసవంతమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది, వారి అదృష్టం వల్ల మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, విదేశీ అవకాశాలు వస్తాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వివిధ గ్రంథాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించగలరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More