ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలని, ఎలాంటి ప్రతికూల శక్తి దరిచేరకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం ఎన్నో రకాల పూజలు, నోములు, పరిహారాలు చేస్తుంటాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితం దక్కదు. అలాంటి సమయాల్లో మన గ్రంథాలు చూపించిన మార్గాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహాపురాణాలలో ఒకైన 'గరుడ పురాణం' కేవలం మరణం గురించే కాకుండా, సంతోషకరమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఎలా గడపాలో వివరిస్తుంది.

ఈ పవిత్ర గ్రంథంలో మన చుట్టూ ఉండే కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను లేదా జీవులను కేవలం స్పర్శించడం వల్ల జీవితంలోని సకల నష్టాలు, నెగెటివ్ ఎనర్జీ దూరమై అదృష్టం ఎలా వరిస్తుందో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఐదు పవిత్ర విషయాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గోమాత దివ్య స్పర్శ - సమస్త పాపహరిణి
హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్ గృహలక్ష్మిగా, తల్లిగా భావిస్తాము. ముక్కోటి దేవతలు ఆవు శరీరంలో కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే మన సంప్రదాయంలో ప్రతి ఇంటిలోనూ మొదటి రొట్టెను గోమాతకు పెట్టే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఎక్కడైనా దారిలో గోమాత కనిపిస్తే నస్కరించి, గోవు పాదాలను తాకడం అత్యంత శుభప్రదమని గరుడ పురాణం చెబుతోంది. గోమాతను లేదా ఆమె పాదాలను స్పర్శించడం వల్ల మనలోని ప్రతికూల శక్తి ఇట్టే తొలగిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఇంట్లో సిరిసంపదలను పెంచుతుంది.
ఆవు పేడ పవిత్రత - సానుకూల శక్తికి ప్రతీక
కాలం మారుతున్న కొద్దీ ఆధునికత పెరిగినప్పటికీ, మన పల్లెల్లో ఇప్పటికీ ఆవు పేడకు ఉన్న ప్రాధాన్యత వేరు. శాస్త్రీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవు పేడ అత్యంత పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. పూర్వం ఏ శుభకార్యం జరగాలన్నా, పూజలు చేయాలన్నా ముందుగా ఇంటిని ఆవు పేడతో అలికేవారు. దీనివల్ల గాలి శుద్ధి అవుతుంది మరియు ఇంట్లోకి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. ఆవు పేడను గౌరవించడం, తాకడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పటికీ లోటు ఉండదని, అన్నపూర్ణాదేవి అనుగ్రహం నిరంతరం ఉంటుందని నమ్ముతారు.
గోమాత పాదాల ధూళి - సకల పుణ్యాల ప్రాప్తి
సాయంత్రం వేళ ఆవులు గోశాల నుంచి లేదా మేత మేసి ఇంటికి తిరిగి వస్తుంటే వాటి కాళ్ల కింద నుంచి లేచే మట్టి ధూళిని 'గోధూళి' అంటారు. ఈ గోధూళి పడటం లేదా దానిని స్పర్శించడం సాక్షాత్ గోదాదేవి లేదా తీర్థయాత్రలు చేసినంతటి పుణ్యాన్ని ఇస్తుందని గరుడ పురాణంలో తేల్చిచెప్పారు. ఈ ధూళిని నుదుట ధరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. పెద్దల కాలం నుంచి ఈ గోధూళికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది.
పంట పొలాలు - రైతు కష్టానికి ప్రతిరూపం
{{/usCountry}}సాయంత్రం వేళ ఆవులు గోశాల నుంచి లేదా మేత మేసి ఇంటికి తిరిగి వస్తుంటే వాటి కాళ్ల కింద నుంచి లేచే మట్టి ధూళిని 'గోధూళి' అంటారు. ఈ గోధూళి పడటం లేదా దానిని స్పర్శించడం సాక్షాత్ గోదాదేవి లేదా తీర్థయాత్రలు చేసినంతటి పుణ్యాన్ని ఇస్తుందని గరుడ పురాణంలో తేల్చిచెప్పారు. ఈ ధూళిని నుదుట ధరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. పెద్దల కాలం నుంచి ఈ గోధూళికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది.
పంట పొలాలు - రైతు కష్టానికి ప్రతిరూపం
{{/usCountry}}ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో పచ్చని పంట పొలాలు ఒకటి. రైతన్న కష్టానికి ప్రతిరూపమైన ఈ పండిన పంటలను, పొలాలను మనసారా గౌరవించాలి. పంట పొలాలను తాకడం, వాటిని ప్రేమించడం వల్ల అన్నపూర్ణాదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఎన్నడూ తిండికి, డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే ప్రకృతిని, పంటలను ప్రేమించే తత్వం ఉండాలని మన గ్రంథాలు బోధిస్తున్నాయి.
పవిత్ర తులసి చెట్టు - అదృష్టాన్ని తెచ్చే దైవిక మొక్క
హిందూ కుటుంబాలలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజూ స్నానం ఆచరించి తులసి కోటను పూజించడం మన సంస్కృతి. గరుడ పురాణం ప్రకారం తులసి మొక్కను భక్తితో తాకడం, ప్రతిరోజూ నీరు సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం తలుపు తడుస్తుంది. ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున తులసిని పూజించి, ఆమె ఆశీస్సులు తీసుకోవడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.