ప్రతిరోజు మన ఇంట్లో దీపం వెలిగితే శుభ ఫలితాలు కలుగుతాయి. దీపం ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే రోజు దీపారాధన చేయడం వలన భక్తి భావం పెరుగుతుంది. దీపారాధన చేయడం వలన చాలా రకాల లాభాలను పొందవచ్చు. అయితే, ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే మిగిలిన వారు ఎవరైనా దీపారాధన చేయొచ్చా, చేయకూడదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే మరొకరు దీపం పెట్టచ్చా?

చాలా మంది ఆడవాళ్లలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఒకరికి నెలసరి వస్తే మిగిలిన వాళ్లు పూజ చేయొచ్చా, చేయకూడదా అని.. శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఇంట్లో ఎవరైనా మహిళలకు నెలసరి వచ్చినట్లయితే ఇంట్లో మిగతా సభ్యులు అంటే భర్త, అత్తమామలు ఇలా ఎవరైనా సరే శుచిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేయొచ్చు. అలాగే వాళ్లు దేవాలయానికి కూడా వెళ్లొచ్చు.
నెలసరి వస్తే ఆడవాళ్లు ఇంటి సామాగ్రిని, దేవుడి సామాగ్రిని తాకకుండా దూరంగా ఉంటే మంచిది. అలాగే వారు వండిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు. వారు తాకకుండా ఉన్నంత దాకా పూజలు, దీపారాధన చేయడం వంటివి మిగిలిన వారు చేయొచ్చు. వారు తాకకుండా ఉంటే అన్నీ పనికొస్తాయి. నిత్య పూజలు చేయకుండా ఆపాల్సిన పనిలేదు.
నెలసరి వస్తే ఆడవాళ్లు ఏ రోజు మళ్లీ పూజ చేయొచ్చు?
ఇదివరకు చాలా మంది నెలసరి వచ్చినప్పుడు దూరంగా కూర్చునేవారు. వేటిని ముట్టుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల రీత్యా వంట చేయడం వంటివి తప్పట్లేదు. పూజ గదిలోకి వెళ్లకుండా, పూజ సామాగ్రిని ముట్టుకోకుండా చూసుకోండి. వంట చేసేటప్పుడు కావాల్సిన సామాగ్రిని మాత్రమే ముట్టుకోండి. నాలుగవ రోజు అన్నిటిని శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి, ఐదవ రోజు మారు స్నానం అయిన తర్వాత యథావిధిగా పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేయొచ్చు. ఈ నాలుగు రోజులు మాత్రం పూజలు, దీపారాధన చేయడం, ఆలయానికి వెళ్లడం నిషిద్ధం.
కొంత మందికి ఏడు లేదా ఎనిమిది రోజులు దాకా పీరియడ్స్ ఉంటాయి. అలాంటి వారు కూడా ఐదవ రోజు తలస్నానం చేసి నియమనిష్టలతో పూజ చేసుకోవచ్చు. కానీ కొందరు ఇంట్లో రుతుస్రావం పూర్తయిన తర్వాత మాత్రమే పూజలు చేయాలని అంటారు. అది కూడా ఒక రకంగా మంచిదే.
ఉపవాసం సమయంలో నెలసరి వస్తే ఏం చేయాలి?
{{/usCountry}}కొంత మందికి ఏడు లేదా ఎనిమిది రోజులు దాకా పీరియడ్స్ ఉంటాయి. అలాంటి వారు కూడా ఐదవ రోజు తలస్నానం చేసి నియమనిష్టలతో పూజ చేసుకోవచ్చు. కానీ కొందరు ఇంట్లో రుతుస్రావం పూర్తయిన తర్వాత మాత్రమే పూజలు చేయాలని అంటారు. అది కూడా ఒక రకంగా మంచిదే.
ఉపవాసం సమయంలో నెలసరి వస్తే ఏం చేయాలి?
{{/usCountry}}కొంతమంది ఉపవాసం ఉంటారు. ఆ రోజుల్లో నెలసరి వస్తే ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. కానీ పూజ మాత్రం చేయకూడదు. కుటుంబ సభ్యులు ఎవరైనా పూజ చేయొచ్చు.
అలాగే కొన్నిచోట్ల ఊరగాయలను ముట్టుకోరు. ఇంట్లో ఇంకొకరు వంట చేస్తారు. దేవుడికి సంబంధించిన పుస్తకాలను కూడా చాలా మంది ఇళ్లల్లో ముట్టుకోరు. నెలసరి సమయంలో ఆవును కూడా చాలామంది తాకరు. ఇలా చాలామంది రకరకాల ఆచారాలను పాటిస్తూ ఉంటారు.