ఈ పువ్వులు మీ దగ్గర ఉంటే శని దేవుడి చల్లని చూపు మీపైనే.. కానీ వాటితో ఏం చేయాలి?

Shani Jayanti 2026 : శని జయంతి మే 16వ తేదీన వస్తుంది. శని జయంతి శనివారం నాడు రావడం చాలా అరుదైనది. ఎవరి జాతకంలోనైనా శని సడే సతి లేదా ధైయా ఉన్నట్లయితే శని దేవుడికి ఇష్టమైన పువ్వును సమర్పించాలి. ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.

Published on: May 15, 2026 12:33 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శని జయంతిని జ్యేష్ఠ అమావాస్య నాడు జరుపుకొంటారు. ఈ సంవత్సరం శని జయంతి మే 16వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరం శని జయంతి శనివారం నాడు రావడం చాలా అరుదైన విషయం. అందువల్ల, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శని జయంతి సందర్భంగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా కొన్ని సులభమైన, ప్రత్యేకమైన పనులు చేయాలి.

శని పూజ
శని పూజ

మీ జాతకంలో శని అంతర్దశ లేదా మహాదశ ఉన్నట్లయితే, కొన్ని విషయాలు ఫాలో కావడం ద్వారా మీకు ఉపశమనం లభించవచ్చు. శని దేవుడికి ఇష్టమైన అపరాజిత పువ్వు(దీనినే శంఖుపుష్పం లేదా శంఖం పువ్వు అని కూడా అంటారు)కు సంబంధించిన కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

  • మీరు శని గ్రహ ప్రభావంలో ఉన్నట్లయితే శని జయంతి రోజున శని దేవుని పాదాల వద్ద నీలి అపరాజిత పువ్వులను సమర్పించండి. పువ్వులను సమర్పించే ముందు ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల శని దేవుని ఆగ్రహం నుండి ఉపశమనం లభిస్తుంది.
  • అంతేకాకుండా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని జయంతి రోజున అపరాజిత పువ్వులతో దండను తయారు చేసి, దానిని మొదట శివుడికి, ఆ తర్వాత శనిదేవుడికి సమర్పించండి.
  • శని గ్రహం సాడేసతి, ధైయ ఉంటే.. ఈ శని జయంతి నాడు 'ఓం శం శనిశ్చరాయ నమః లేదా ఓం ప్రాం ప్రిం ప్రౌం సః శనిశ్చరాయ నమః', 108 సార్లు జపించి శనికి అపరాజిత పుష్పాలను సమర్పించండి.
  • శని జయంతి రోజున శమీ వృక్షం వేరును, అపరాజిత వృక్షం వేరును ఒక నల్లటి వస్త్రంలో చుట్టి మీ చేతికి కట్టుకోండి. ఇది శని ఆగ్రహం నుండి కూడా కొంత ఉపశమనాన్ని అందిస్తుంది.
  • శని జయంతి సందర్భంగా మీరు అపరాజిత మొక్కలను దానం చేయవచ్చు. ఈ రోజున మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల శని దేవుని ఆశీస్సులు లభిస్తాయి. మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటి దానిని పెంచండి.
  • శని కారణంగా ఎముకలకు సంబంధించిన సమస్య లేదా ఏదైనా చర్మ సంబంధిత వ్యాధి ఉంటే అపరాజిత పువ్వుతో పేస్ట్ తయారు చేసి పూయడం ద్వారా ఆ వ్యాధిని నయం చేయవచ్చని చెబుతారు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More