చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఈ పనులు చేయొచ్చా? ఈ పనులు చేయకూడదా? అలాగే ఈరోజు ఈ పనులు చేయొచ్చా? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు చాలా మందిలో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
1.ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చెయ్యచ్చా?

చాలా మంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇంట్లో శివలింగం ఉండకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? అలా ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించడం తప్పా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. ఇంట్లో శివలింగం ఉండొచ్చు, తప్పులేదు. నిజానికి ఇంట్లో బంగారం, వెండి, ఇత్తడి లాంటి లోహాలతో చేసిన శివలింగాన్ని పెట్టుకుంటే నియమ నిష్టలను తప్పక పాటించాలి. అలా పూజిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
శివలింగం ఎప్పుడూ కూడా రెండు అంగుళాలకు మించి ఉండకుండా చూసుకోవాలి. అంటే బొటనవేలు పరిమాణానికి మించి ఉండకూడదు. స్పటిక లింగం, బాణలింగం వంటి వాటికి కూడా నియమ నిష్టలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో ఈ నియమాలను పాటించడం కష్టంగా ఉంటుంది. కనుక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదని చాలా మంది చెప్పడం మొదలుపెట్టారు. అయితే స్త్రీలు లింగాకృతికి పూజలు చేయకూడదు, పటానికి మాత్రమే పూజ చేయాలి అని గుర్తుపెట్టుకోండి.
2.శివుడికి ఒళ్లంతా బూడిద ఎందుకు ఉంటుంది? దానిలో అంతర్యం ఏంటి?
ప్రతి ఒక్కరూ కూడా వారి దేహం మీద మమకారాన్ని పెంచుకుంటారు. పైగా “నాది” అనే భావన కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోతారు. “నాది” అన్న దాని కోసం సొంత బంధువులను కూడా వదలుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారికి ఆఖరికి ఏం మిగులుతుంది? దేహమే కదా. కానీ ఆఖరికి ఏం మిగులుతుంది? సంపాదించిన ఆస్తి ఉండదు.దేహం కూడా చనిపోయాక వారిది కాదు. ఆఖరికి మిగిలేది బూడిద మాత్రమే అనే సత్యాన్ని మనకు ఇది తెలుపుతుంది. శివుడు ఒంటిమీద ఉన్న బూడిద వెనుక అంతర్యం ఇదే.
3.ప్రణవ పంచాక్షరి అంటే ఏంటి?
ప్రణవం అంటే ఓంకారం. “నమ: శివాయ” అనేది పంచాక్షరి. ప్రణవ పంచాక్షరి అంటే “ఓం నమ: శివాయ”. “నమ: శివాయ ” అంటే శుభస్వరూపుడు, కళ్యాణ స్వరూపుడు అయిన వానికి, దోషము లేని వానికి నమస్కారం అని అర్థం.
4.శివుడికి, నందికి మధ్య ఎందుకు నడవకూడదు?
{{/usCountry}}ప్రణవం అంటే ఓంకారం. “నమ: శివాయ” అనేది పంచాక్షరి. ప్రణవ పంచాక్షరి అంటే “ఓం నమ: శివాయ”. “నమ: శివాయ ” అంటే శుభస్వరూపుడు, కళ్యాణ స్వరూపుడు అయిన వానికి, దోషము లేని వానికి నమస్కారం అని అర్థం.
4.శివుడికి, నందికి మధ్య ఎందుకు నడవకూడదు?
{{/usCountry}}ఈశ్వరుడి వాహనం నంది పరమశివుని భక్తులలో అగ్రగణ్యుడు. నంది ఎప్పుడూ కూడా భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని దర్శిస్తుంటాడు. అలాగే శివుడు నంది పై తన అనుగ్రహ దృష్టిని ఎప్పుడూ కూడా ప్రసరింపజేస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య నడిస్తే పరస్పర దృష్టి ప్రసారానికి విఘాతం ఏర్పడుతుందని, ఇద్దరూ కోపానికి గురవుతారని చెప్తారు. కాబట్టి శివుడికి, నందికి మధ్య నడవకూడదు.
5.శివకేశవ అనే నామస్మరణ చేయాలా? శివ, కేశవ అని విడివిడిగా నామస్మరణ చేయాలా?
“శివకేశవ” అనే నామస్మరణ చేసినా తప్పులేదు. అలాగే “శివ”, “కేశవ” అని విడివిడిగా కూడా నామస్మరణ చేసుకోవచ్చు. రెండింటినీ అనుసరించవచ్చు. ఏదీ తప్పు కాదు.